హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

NIA Raids: ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. PFI కార్యకర్తల అరెస్ట్

NIA Raids: ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. PFI కార్యకర్తల అరెస్ట్

ఎన్ఐఏ సోదాలు

ఎన్ఐఏ సోదాలు

NIA Raids: గతంలో నిజామాబాద్‌లో కరాటే టీచర్ అబ్దుల్ ఖాదర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. కరాటే ముసుగులో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తోందని పీఎఫ్ఐ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  దేశవ్యాప్తంగా NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) మెరుపు దాడులు నిర్వహిస్తోంది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 13 రాష్ట్రాల్లో 100 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.  PFI  (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యాలయాలతో పాటు కార్యకర్తల ఇళ్లల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించడంతో (Terror Funding)  పాటు యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు  ఆ సంస్థపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆ సంస్థకు చెందిన కార్యాలయాలు, ముఖ్య నేతలు, కార్యకర్తల ఇళ్లలపై ఎన్ఐఏ మెరుపు దాడులు (NIA Raids) చేసింది. తనిఖీల్లో కీలక ఆధారాలను సేకరించి.. పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోంలో రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఎన్ఐఏతో పాటు ఈడీ దాడులు కూడా జరుగుతున్నాయి. సోదాల అనంతరం 100 మందికి పైగా కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

  అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లోని పలు చోట్ల ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. చాంద్రాయణ గుట్టలోని పీఎఫ్ఐ కార్యాలయాన్ని సీజ్ చేశారు. హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్స్, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్, ఘట్‌కేసర్‌లోనూ తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్‌లో 8 చోట్ల సోదాలు చేపట్టారు. అటు ఏపీలోనూ ఎన్ఐఏ రైడ్స్ జరుగుతున్నాయి. కర్నూలు , గుంటూరులోని పలువురు పీఎఫ్ఐ కార్యాకర్తల ఇళ్లల్లో సోదాలు చేసి.. కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

  IND vs AUS: క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. ఉప్పల్ టీ20 మ్యాచ్‌ టికెట్ల విక్రయం నేడే

  కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు చోట్ల ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. దాదాపు 40 చోట్ల దాడులు నిర్వహించి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో అనేక డిజిటల్ పరికరాలు, కీలక పత్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. వారు ఇచ్చిన సమాచారంతో మిగతా రాష్ట్రాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

  గతంలో నిజామాబాద్‌లో కరాటే టీచర్ అబ్దుల్ ఖాదర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. కరాటే ముసుగులో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తోందని పీఎఫ్ఐ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. పీఎల్ఐ ఇచ్చిన సూచనలతోనే తన ఇంటిపై యువతకు శిక్షణ ఇస్తున్నట్లు అబ్దుల్ ఖాదర్ తెలిపారు. ఇందుకోసం అబ్దుల్‌కు ప్రతి నెలా భారీగా నగదు ఇస్తోంది పీఎఫ్ఐ. ఈ క్రమంలో అతడు ఇచ్చిన సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేసింది ఎన్ఐఏ.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, NIA, PFI, Telangana

  ఉత్తమ కథలు