అతను దొంగ..లేక పోలీసా అనేది గుర్తు పట్టకుండా తప్పించుకున్నాడు. మధ్యప్రదేశ్(Madhya pradesh)లో ఓ పెట్రోల్ బంకు(Petrol bunk) కు టూవీలర్‌పై వచ్చిన వ్యక్తి చేసిన మోసానికి సంబంధించిన వీడియో(Video)ఇప్పుడు సోషల్ మీడియా(Social media)లో చక్కర్లు కొడుతోంది. బైక్ మీద పోలీస్ అని రాసుకొని పోలీస్ యూనిఫామ్ (Police uniform)వేసుకున్నాడు. భుజానికి తుపాకీ వేలాడదీసుకున్న ఓ వ్యక్తి గ్వాలియర్ (Gwalior) ఫుల్‌బాగ్ (Phool bagh)చౌరస్తాలోని పెట్రోల్ బంకుకు వెళ్లాడు. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న వ్యక్తికి తన టూవీలర్లో ట్యాంక్ ఫుల్ చేయమని చెప్పాడు. బంక్ సిబ్బంది బైకులో పెట్రోల్ ట్యాంక్ ఫల్ చేశాడు. బంకు సిబ్బంది డబ్బులు అడిగేలోపే బైక్‌తో పరార్ అయ్యాడు ఆగంతకుడు. పోలీస్ డ్రెస్‌లో భుజానికి తుపాకీ వేలాడదీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరు డబ్బులు ఇవ్వకుండా ఎందుకు అలా పారిపోయాడో అర్ధం కాకపోవడంతో పెట్రోల్ బంకులో పనిచేస్తున్న సిబ్బంది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెట్రోల్ బంక్‌లోని సీసీ ఫుటేజ్‌ని పరిశీలించారు. మోసగాడు వేసుకొన్ని వాహనం నెంబర్ ఏంటీ , నిజంగా పోలీసేనా అని ఆరా తీస్తున్నారు.
పెట్రోల్ కోసం పోలీస్ వేషం..
పెట్రోల్ బంక్ సిబ్బందికి టోకరా వేసిన వ్యక్తి ఎవరో గుర్తు పట్టడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. సిబ్బందిని ఏమరపాటుకు గురి చేసి డబ్బులు చెల్లించకుండా పారిపోయాడు. రాత్రి సమయంలో బైకుపై రావడంతో సీసీ ఫుటేజ్‌లో అతని ముఖం గుర్తు పట్టడం కుదరడం లేదు. అందులో ఫేస్‌కి మాస్క్ పెట్టుకోవడంతో పాటు తలను మఫ్లర్‌తో కవర్ చేసుకున్నాడు. సీసీ కెమెరా ఫీడ్ అంతా గమనించిన పోలీసులు నిందితుడు పక్కా ప్లాన్ ప్రకారమే మోసానికి పాల్పడినట్లు నిర్దారించారు. ఎవరికి అనుమానం రాకుండా పోలీసుల పేర్లను వాడుకున్నాడు. పెట్రోల్ బంక్ సిబ్బందిని బురిడి కొట్టించిన వ్యక్తి ని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.
దొంగ, పోలీస్ ఆట
గ్వాలియర్‌లో పోలీస్ గెటప్‌లో వచ్చి పెట్రోల్ బంక్ సిబ్బందిని చీట్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఎవరైనా సరే పెట్రోల్ బంకులకు వస్తే పోలీసుల పేరు చెప్పినా, యూనిఫామ్ చూపించినా భయపడవద్దని ధైర్యంగా వాళ్లను ముందే డబ్బులు అడిగి తీసుకున్న తర్వాతే పెట్రోల్ పోయమని నగరంలోని పెట్రోల్ బంకు సిబ్బంది, యాజమానులకు సూచించారు పోలీసులు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.