సియాచిన్‌లో రక్షణ శాఖ మంత్రి హోదాలో రాజ్‌నాథ్ తొలి పర్యటన

Defence Minister Rajnath Singh Visits Siachen | రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్‌నాథ్ సింగ్ తొలి పర్యటనగా సియాచిన్‌లో పర్యటించారు.

news18-telugu
Updated: June 3, 2019, 3:19 PM IST
సియాచిన్‌లో రక్షణ శాఖ మంత్రి హోదాలో రాజ్‌నాథ్ తొలి పర్యటన
సియాచిన్‌లో పర్యటించిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
news18-telugu
Updated: June 3, 2019, 3:19 PM IST
రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్‌నాథ్ సింగ్ తొలి పర్యటనగా సియాచిన్ గ్లేసియర్‌ను సందర్శించారు. అక్కడి భద్రతా పరిస్థితులను సమీక్షించారు. అక్కడ సైనికాధికారులు, జవాన్లను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా సియాచిన్ గ్లేసియర్ పర్యటనకు వెళ్లారు. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రంగా సియాచిన్ గ్లేసియర్‌కు పేరుంది. 12వేల అడుగుల నుంచి 23 వేల అడుగుల ఎత్తులో భారత్ బేస్‌ క్యాంప్స్‌ ఉంటాయి.

సియాచిల్‌లో దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన అమర జవాన్ల కోసం ఏర్పాటు చేసిన స్థూపం దగ్గర రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు.సియాచిన్ దగ్గర బందోబస్తు విధుల్లో పాల్గొంటూ దాదాపు 1100 మంది భారత జవాన్లు ప్రాణాలు అర్పించారు.

First published: June 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...