news18-telugu
Updated: July 11, 2020, 7:13 PM IST
ప్రతీకాత్మక చిత్రం
పేపర్ల ప్రకారం గుజరాత్ మద్య రహిత రాష్ట్రం. అయితే, అధికార పార్టీకి చెందిన బీజేపీ నేత ఏకంగా మందు పార్టీ ఇచ్చారు. తన పుట్టిన రోజు అందిరికీ ఫుల్లుగా ఫుల్లు బాటిల్స్ ఇచ్చేశారు. అసలే కరోనా. ఇప్పుడు అందరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం చెబుతోంది. అయినా కూడా రోడ్డు మీద ఎలాంటి సామాజిక దూరం పాటించకుండానే మందు పార్టీ, కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఓ పెద్ద కత్తిని తీసుకుని కేక్ కట్ చేసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడికి వచ్చిన వారు మద్యం పోశారు. తమ మీద కూడా మందు పోసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. గుజరాత్‌లోని మహీసాగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆ బీజేపీ నేత జిల్లా కన్వీనర్ కన్వల్ పటేల్‌గా గుర్తించారు.
ఈ వీడియోలో కన్వల్ పటేల్ కారు బానెట్ మీద పెట్టిన భారీ కేకును కత్తితో కోస్తున్నారు. అంతలోనే ఆయన ఫ్రెండ్స్ బాటిల్స్ ఓపెన్ చేసి మందు అందరి మీదా పోస్తూ హంగామా చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర మెహ్రా కూడా ఉన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
July 11, 2020, 7:13 PM IST