హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

వాహనాలలో పెట్రోల్ కావాలా..?.. ఇక నుంచి ఆ సర్టిఫికేట్ చూపించాల్సిందే.. ఎక్కడంటే..

వాహనాలలో పెట్రోల్ కావాలా..?.. ఇక నుంచి ఆ సర్టిఫికేట్ చూపించాల్సిందే.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: వాహనాదారులపై రవాణా అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇక నుంచి బంక్ లలో పెట్రోల్ పోయాలంటే, కొన్ని సర్టిఫికేట్ తప్పనిసరిగా చూపించాలంటూ అధికారులు సూచించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

దేశ రాజధాని ఢిల్లీ లో (Delhi) రోజురోజుకు వాయుకాలుష్యం పెరిగిపోతుంది. ఇప్పటికే కేజ్రీవాల్ సర్కారు గాలిలో కాలుష్యాన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. గతంలో వెహికిల్ నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి సరిబేసి విధానంను పాటించారు. దీంతో కొన్ని రోజుల్లోనే వాయుకాలుష్యం గణనీయంగా తగ్గింది. ఇదిలా ఉండగా.. తాజాగా, ఢిల్లీ ప్రభుత్వం వాహన దారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట బంకుల్లో పెట్రోల్ పోయాలంటూ యజమాని తప్పనిసరిగా పోల్యుషన్ సర్టిఫికేట్ చూపించాలంటూ రోడ్డు, రవాణా, ట్రాఫిక్ అధికారులు తెలిపారు. పొల్యుషన్ సర్టిఫికేట్ లేకుంటే.. బంకుల్లో పెట్రోల్ పోయకుండా చర్చలు తీసుకుంటున్నారు. కాగా, ఢిల్లీలో అనేక చోట్ల కాలం చెల్లిన వాహనాలను ఇంకా నడిపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

దీంతో వీరిని కంట్రోల్ చేయడానికి అధికారులు ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై మరో వారంరోజుల్లో స్పష్టమైన విధి విధానాలు తెలుస్తాయని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ తర్వాత అక్టోబర్ 25 నుంచి దీన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ రవాణా శాఖ ప్రకారం.. 13 లక్షల ద్విచక్ర వాహనాలు, మూడు లక్షల కార్లతో సహా 17 లక్షల వాహనాలు జూలై 2022 వరకు చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్లు లేకుండా నడపబడుతున్నాయి. కాగా, చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికేట్ లేకుండా పట్టుబడితే, వాహన యజమానులు మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా ₹ 10,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా తమ వాహనాలకు సంబంధించిన పీయూసీ సర్టిఫికెట్లను తనిఖీ చేసుకోవాలని సూచించినట్లు మంత్రి తెలిపారు.

అక్టోబరు 6 నుండి ఢిల్లీలో ప్రభుత్వం.. కాలుష్య వ్యతిరేక ప్రచారం కూడా ప్రారంభించబడుతుందని, వాహనాల నుంచి వచ్చే పొగ కాలుష్యాన్ని తనిఖీ చేయడానికి నిర్మాణ ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని మిస్టర్ రాయ్ చెప్పారు. 5,000 చదరపు మీటర్ల కంటే పెద్ద నిర్మాణ స్థలాలు ఒక యాంటీ స్మోగ్ గన్‌ని, 10,000 చదరపు మీటర్ల కంటే పెద్దవి అలాంటివి రెండు గన్‌లను కలిగి ఉండాలని, 20,000 చదరపు మీటర్ల కంటే పెద్ద సైట్‌లు దుమ్ము కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి నాలుగు యాంటీ స్మోగ్ గన్‌లను ఉపయోగించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. "నిర్మాణ ప్రదేశాలలో కంపెనీలు ఈ చర్యలను పాటించకపోతే, కాలుష్య నిరోధక ప్రచారం కింద వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని మిస్టర్ రాయ్ చెప్పారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Motor vehicle act, VIRAL NEWS