బీహార్‌లో IIT గ్రాడ్యుయేట్ల గ్రామం... ఎన్డీయేని వ్యతిరేకిస్తోంది... ఎందుకంటే...

Lok Sabha Elections 2019 : ఓ హత్య, ఓ డిమాండ్... రెండూ కలిసి బీహార్‌లో ఆ గ్రామస్థులను ఎన్డీయేకి దూరం చేస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: April 3, 2019, 3:04 PM IST
బీహార్‌లో IIT గ్రాడ్యుయేట్ల గ్రామం... ఎన్డీయేని వ్యతిరేకిస్తోంది... ఎందుకంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దక్షిణ బీహార్‌లోని గయలో ఉన్న పత్వా తోలీ ప్రత్యేకమైనది. అక్కడ ఎక్కువ మంది IIT గ్రాడ్యుయేట్లే ఉన్నారు. సంప్రదాయ బద్ధంగా చూస్తే... ఆ ప్రాంతంలో నేత కార్మికులు ఎక్కువ. ప్రతీ ఇంట్లో నేత పనిముట్లు, యంత్రాలూ కనిపిస్తుంటాయి. ఒకప్పుడు మరమగ్గాలతో చాలా పని ఉంటేది. వ్యాపారం బాగా జరిగేది. కాలక్రమంలో నేతపనికి డిమాండ్ పడిపోయింది. ఐతే... తమ జీవితాల్లో వెలుగు లేదని వారెవరూ అనట్లేదు. కారణం అక్కడి దాదాపు ప్రతీ ఇంటి నుంచీ ఓ ఇంజినీర్... బీహార్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో సెటిలయ్యారు. వారిలో ఎక్కువ మంది IIT గ్రాడ్యుయేట్లే.

తాము IITలకు 180 మంది విద్యార్థులను పంపామనీ, వాళ్లలో 30 కుటుంబాల వాళ్లు అమెరికాలో సెటిల్ అయ్యారని... 1400 నేత కుటుంబాలకు పెద్దగా వ్యవహరించే ప్రేమ్ నారాయణ్ పత్వా తెలిపారు. ఓ కుటుంబంలో ఏకంగా ఏడుగురు ఐఐటియన్లు ఉన్నట్లు ఆయన వివరించారు. తమ ఊరిలో అబ్బాయిలూ, అమ్మాయిలూ అంతా ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్తే... మొత్తం 800 మంది ఇంజినీరింగ్ చదివినట్లవుతుందన్నారు ఆయన.


బీహార్‌ లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 11న జరగనుంది. పత్వాతోలీలో కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. పత్వా తోలీలో ప్రచారం చేసిన నేతలు ఎడ్యుకేషన్, వ్యాపారంపైనే ఎక్కువ హామీలిచ్చారు. మొదటి నుంచీ ఇక్కడ బీజేపీకి అనుకూలంగా సంప్రదాయ ఓటర్లున్నారు. కానీ ఇప్పుడు వారి మైండ్ సెట్ మారింది. అందుకు రెండు కారణాలున్నాయి. జనవరి 6న పత్వా తోలీకి చెందిన ఓ అమ్మాయి తల లేని శవం ఒకటి పొలాల్లో కనిపించింది. అంతకు పది రోజుల కిందటే ఆమె మిస్సింగ్ అయ్యింది. ఆమె ఎవరినో ప్రేమిస్తుందన్న సందేహంతో... ఆమె తల్లిదండ్రులే ఆమెను చంపేశారనే అనుమానాలున్నాయి. పోలీసులు ఆమె బాయ్ ఫ్రెండ్ తండ్రితోపాటూ మరో ఐదుగుర్ని అరెస్టు చేశారు. ఈ కేసును పరువు హత్యగా గయ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పత్వా వర్గం ప్రజలు అందుకు ఒప్పుకోవట్లేదు. ఈ హత్య వెనక స్థానిక ఓ యువకుడి హస్తం ఉందనీ... అతను ఉన్నత వర్గానికి చెందినవాడు కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవటంలేదని ఆరోపిస్తున్నారు. ఇందుకు ఎన్డీయే ప్రభుత్వంలో నేతలు సహకరిస్తున్నారని మండిపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం తమ కోసం ఏమీ చెయ్యట్లేదని తోలీ పత్వా ప్రజలు అంటున్నారు. 1991 నుంచీ తాము బీజేపీతోనే ఉన్నామనీ, బీజేపీ నేతలకే ఓట్లు వేశామనీ... కానీ తోలీ పత్వాలో అభివృద్ధి జరగలేదని వారు చెబుతున్నారు. కులం అంశం కూడా ఇక్కడి ఎన్నికల్ని ప్రభావితం చేస్తోంది. మహాకూటమి అభ్యర్థి జితం రామ్ మాంజీ, ఎన్డీయే అభ్యర్థి విజయ్ కుమార్ మాంఝీ ఇద్దరూ ముసహార్ వర్గానికి చెందినవారే. వాళ్లు ఎస్సీ కేటగిరీ కిందకు వస్తారు. పత్వాలను రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ కేటగిరీగా నిర్ణయించింది. అందువల్ల ప్రజలు ఎవరికీ ఓటు వేసేందుకు ఆసక్తి చూపించట్లేదు. తమకు ఎస్సీ/ఎస్టీ స్టేటస్ కల్పించాలని పత్వాలు కోరుతున్నా... NDA ప్రభుత్వం నెరవేర్చకపోవడంపై కూడా స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. అందువల్ల వారు ఎవరికి ఓటు వేస్తారన్నది ఈసారి ఆసక్తి రేకెత్తిస్తోంది.

 

ఇవి కూడా చదవండి :

శభాష్ మాన్వీ... మహిళా కానిస్టేబుల్‌కి యూపీ డీజీపీ ప్రశంసలు... ఆమె చేసిన మంచి పనేంటంటే...అన్నదాత సుఖీభవ నిధులు విడుదల... ఏపీలో రైతు కుటుంబాల అకౌంట్లలోకి రూ.3000 చొప్పున జమ

ప్రధాని మోదీకి ఝలక్... నమో టీవీపై వివరణ కోరిన ఈసీ

విద్యకు జీడీపీలో 6 శాతం ఖర్చు చేస్తామన్న కాంగ్రెస్... ప్రస్తుతం విద్యకు ఎంత ఖర్చవుతోంది... ఓ విశ్లేషణ
First published: April 3, 2019, 3:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading