రాహుల్ గాంధీ జంధ్యంపై రామభక్తులు నిలదీయాలి: స్మృతి ఇరానీ

రాహుల్ గాంధీ జంధ్యంపై ప్రజలంతా నిలదీయాలని సూచించారు. ఆయన హిందువా? కాదా? అని అర్ధం వచ్చేలా ఆమె వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: January 4, 2019, 2:53 PM IST
రాహుల్ గాంధీ జంధ్యంపై రామభక్తులు నిలదీయాలి: స్మృతి  ఇరానీ
స్మృతి ఇరానీ
  • Share this:
సార్వత్రిక ఎన్నికలు, సుప్రీంకోర్టులో విచారణ వేళ..అయోధ్య రామమందిరంపై మళ్లీ రాజకీయ రగడ నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాహుల్ గాంధీ టార్గెట్‌గా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుప్రీంకోర్టులో అయోధ్య కేసు విచారణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ జంధ్యంపై ప్రజలంతా నిలదీయాలని సూచించారు. ఆయన హిందువా? కాదా? అని అర్ధం వచ్చేలా ఆమె వ్యాఖ్యానించారు.

అయోధ్య రామమందిరంపై కాంగ్రెస్ రాజకీయాలు చేయడం సరికాదు. విశ్వాసానికి సంబంధించిన అంశం. తమ పార్టీకి చెందిన లాయర్లతో కాంగ్రెస్ పార్టీ అయోధ్య కేసు విచారణకు అడ్డంకులు సృష్టిస్తోంది. ప్రజలు, రామభక్తులు రాహుల్ గాంధీని నిలదీయాలి. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఆయన జంధ్యాన్ని ధరిస్తారా? అని ప్రశ్నించాలి.
స్మృతి ఇరానీ


కేవలం ఎన్నికలు వచ్చిన్నప్పుడు మాత్రమే రాహుల్ గాంధీకి గుళ్లు, దేవుళ్లు గుర్తుకొస్తారని ఎద్దేవా చేశారు స్మృతి ఇరానీ. హిందూ ప్రజల ఓట్లు కావాలి గానీ..వారి మనోభావాలు కాంగ్రెస్‌కు పట్టవని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది కపిల్ సిబాల్... అయోధ్య కేసు విచారణకు అడ్డుపడుతున్నారని పరోక్షంగా స్మృతి ఇరానీ విమర్శించారు. కాగా, అయోధ్య కేసు విచారణను 2019 ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదావేయాలని సుప్రీంకోర్టులో పలుమార్లు కపిల్ సిబాల్ వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.
Published by: Shiva Kumar Addula
First published: January 4, 2019, 2:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading