తేజశ్వినికి షాక్... బెంగళూరు సౌత్‌కి తేజశ్వి సూర్యను ఎంపిక చేసిన బీజేపీ

Lok Sabha Elections 2019 : రాజకీయ నేతైన భర్త చనిపోతే... ఆ స్థానంలో ఆయన భార్యను నిలబెట్టే సంప్రదాయానికి బీజేపీ స్వస్థి పలికింది.

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 5:54 PM IST
తేజశ్వినికి షాక్... బెంగళూరు సౌత్‌కి తేజశ్వి సూర్యను ఎంపిక చేసిన బీజేపీ
సూర్య, తేజశ్విని (File)
Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 5:54 PM IST
బీజేపీకి కంచుకోటైన దక్షిణ బెంగళూరుకు ఎవర్ని లోక్ సభ అభ్యర్థిగా నిలబెడతారన్నదానిపై నిన్నటిదాకా సస్పెన్స్ నడిచింది. ఆ స్థానంలో నరేంద్ర మోదీ పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. లేదంటే ఆ స్థానంలో గతేడాది నవంబర్ 12న చనిపోయిన సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి అనంతకుమార్ భార్య తేజశ్వినిని దింపుతారని అంతా భావించారు. బీజేపీ అర్థరాత్రి ప్రకటించిన జాబితాలో... అనూహ్యంగా... కుర్రాడైన తేజశ్వి సూర్య పేరుంది. 1996 నుంచీ 2014 వరకూ బెంగళూరు సౌత్‌లో గెలుస్తున్నది అనంతకుమారే. ఆయన చనిపోవడంతో... ఆయన భార్య పేరునే రాష్ట్ర బీజేపీ.. ఢిల్లీ హైకమాండ్‌కి ప్రతిపాదించింది. తనకున్న స్వచ్ఛంద సంస్థ వల్ల తేజశ్వినికి నియోజకవర్గంలో మంచి పేరుంది కూడా. రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప సైతం ఆమెకే మద్దతు పలికారు.

గత వారం వరకూ ఆమె పేరును ప్రకటించడం లాంఛనమే అనుకున్నారంతా. ఐతే... నాల్రోజుల కిందట... ఆ స్థానం నుంచీ ప్రధాని మోదీ బరిలో దిగుతారని ప్రచారం మొదలవ్వడంతో సమీకరణలు ఒక్కసారిగా మారాయి. క్యాంప్ రాజకీయాలు తెరతీశాయి. కాంగ్రెస్ అన్నీ ఆలోచించి... రాజ్యసభ ఎంపీ బీ కే హరిప్రసాద్‌ను బరిలో దింపింది. ఆయన మామూలోడు కాదు. 1999 లోక్ సభ ఎన్నికల్లో... అనంతకుమార్ కంటే 65 వేల ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారు. అలాంటి బలమైన అభ్యర్థిని బరిలో దింపిన టైంలో... బీజేపీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర బీజేపీ నేతల్ని షాక్‌లో పడేసింది.


lok sabha elections 2019,lok sabha election,lok sabha election 2019,2019 lok sabha elections,lok sabha elections,2019 elections,lok sabha polls,lok sabha elections 2019 telangana,india lok sabha election date,andhra pradesh lok sabha election 2019,india lok sabha election 2019,bjp leader before lok sabha elections,telangana 2019 lok sabha,election,lok sabha alliance,ap assembly elections 2019,ap assembly elections,ap elections 2019,assembly elections,ap elections,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly elections 2019 survey,ap assembly elections 2019 schedule,ap assembly elections 2019 predictions,ap assembly election schedule 2019,ap assembly elections 2019 candidates list,opinion poll survey on ap assembly elections 2019,ap politics,లోక్ సభ ఎన్నికలు,బెంగళూరు సౌత్,నరేంద్ర మోదీ,అనంతకుమార్,తేజశ్విని,తేజశ్వి సూర్య,దక్షిణ బెంగళూరు,బెంగుళూరు,
అనంతకుమార్, తేజశ్విని (File)


బీజేపీ హైకమాండ్ నిర్ణయించిన తేజశ్వి సూర్యాకు హిందుత్వ కార్డ్ ఉంది. ఈ విషయంపై స్పందించిన తేజశ్విని... తనకు దేశం ప్రథమ ప్రాధాన్యమనీ, పార్టీ రెండోదనీ, తన వ్యక్తిగత జీవితం చివరిదని తెలిపారు.





కర్ణాటకలో... కాంగ్రెస్, జేడీఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్‌ నడిపిస్తుండటంతో... వాళ్లకు షాకిచ్చేందుకే బీజేపీ... తేజశ్వి సూర్యను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. లాయరైన సూర్య... రాష్ట్ర బీజేపీ యువ మోర్చాకు ఉపాధ్యక్షుడు. హిందువులకు అనుకూలంగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. చాలా సందర్భాల్లో మోదీని వ్యతిరేకించేవారిని ఆయన తీవ్ర స్థాయిలో ఖండించారు. బీజేపీ మీడియా మేనేజ్‌మెంట్ సెల్‌లో కీలకంగా వ్యవహరించే సూర్య... యడ్యూరప్ప క్యాంప్‌తో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన మావయ్య రవి సుబ్రహ్మణ్య... కూడా బెంగళూరు సౌత్ నియోజకవర్గం లోని బసవనగూడి నుంచీ బీజేపీ ఎమ్మెల్యేగా మూడోసారి కొనసాగుతున్నారు.

తేజశ్వి సూర్యను... అనంతకుమార్ మద్దతు దారులు సహించలేరు. అలాగని పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. 1977 నుంచీ బెంగళూరు సౌత్... కాంగ్రెస్ వ్యతిరేక నియోజక వర్గంగా కొనసాగుతోంది. గత 10 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది ఒక్క 1989లో మాత్రమే. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి గుండూరావ్ మాత్రమే భారీ మెజార్టీతో గెలిచారు. 1991 నుంచీ ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా మారింది. గుండూరావ్ కొడుకు దినేష్ గుండూరావ్... ప్రస్తుతం కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గంలోని గాంధీనగర్ నుంచీ ఐదోసార్లు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.


1977 నుంచీ బెంగళూరు సౌత్‌కి బ్రాహ్మణులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ వ్యవస్థాపకుడైన నందన్ నీలేఖని... కాంగ్రెస్ తరపున పోటీ చేసి అనంతకుమార్ చేతిలో ఓడిపోయారు. మరోసారి అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తేజశ్వి సూర్య కూడా బ్రాహ్మణుడే కావడం మరో ప్లస్ పాయింట్. ఆయన గెలిస్తే... పదో బ్రాహ్మణ ప్రాతినిధ్యం కిందకు వస్తుంది. మే 23న వచ్చే ఫలితాలతో ఆయన ఫ్యూచరేంటన్నది తేలుతుంది.

 

ఇవి కూడా చదవండి :

మీకెంత... మాకెంత... చివరి దశలో తెలుగు రాష్ట్రాల ఆస్తుల పంపకాలు

జగన్ సోదరి షర్మిలపై అసభ్య కామెంట్లు... యువకుణ్ని అరెస్టు చేసిన పోలీసులు

ఏపీలో గెలిచేది టీడీపీ... చంద్రబాబు మళ్లీ సీఎం... ఓ పత్రిక కథనం

ఇది వ్యూహకర్తల కాలం... నేతలను నడిపిస్తున్నది వాళ్లే... దేశవ్యాప్తంగా 300 కన్సల్టెన్సీలు
First published: March 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...