ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ... 50 మంది దివ్యాంగ విద్యార్థుల ఎంపిక

Pariksha Pe Charcha : పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా అన్ని రకాల విద్యార్థుల్లోనూ ఆత్మస్థైర్యం నింపేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా... 50 మంది దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది.

news18-telugu
Updated: January 18, 2020, 2:40 PM IST
ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ... 50 మంది దివ్యాంగ విద్యార్థుల ఎంపిక
విద్యార్థులతో ప్రధాని మోదీ (File)
  • Share this:
Pariksha Pe Charcha Programme : మొదటిసారిగా... 50 మంది దివ్యాంగ విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో అవకాశం కల్పిస్తున్నారు. ఇది వరకు ఇలాంటి నిర్ణయం ప్రత్యేకంగా తీసుకోలేదు. ఈసారి మాత్రం దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. మొత్తం 2000 మంది విద్యార్థులు, టీచర్లూ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. వీళ్లలో 1050 మందిని ఎస్సే కాంపిటీషన్ నిర్వహించి సెలెక్ట్ చేశారు. పరీక్షా పే చర్చ మూడో ఎడిషన్‌ను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జనవరి 20న జరిగే ఈ కార్యక్రమంలో... పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ... కొన్ని విలువైన సూచనలు చెయ్యబోతున్నారు. తద్వారా పరీక్షలపై విద్యార్థులకు ఉండే భయాలూ, టెన్షన్లు కొంతవరకూ తగ్గుతాయని భావిస్తున్నారు. ఈ ఇంటరాక్షన్ మీటింగ్... ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరగబోతోంది. ఇందులో ప్రధానికి ప్రశ్నలు వేసేందుకు కొందరు విద్యార్థుల్ని ఎంపిక చేశారు. వాళ్లు మాత్రమే ప్రశ్నించే వీలు ఉంటుంది. ఆ విద్యార్థుల్లో... దేశవ్యాప్తంగా దివ్యాంగ స్కూళ్ల నుంచీ... 50 మంది విద్యార్థుల్ని ఎంపిక చేశారు. వాళ్లంతా ప్రధాని మోదీతో ఇంటరాక్ట్ అవుతారు.

దివ్యాంగ విద్యార్థుల్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా పెయింటింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఎగ్జామ్స్‌లో ఒత్తిడిని జయించడం ఎలా అనే అంశం ఇచ్చి... దాని ఆధారంగా పెయింటింగ్ వెయ్యమన్నారు. చక్కగా పెయింటింగ్స్‌ వేసిన విద్యార్థుల్ని ఎంపిక చేశారు. మరో స్పెషల్ ఏంటంటే... చక్కటి పెయింటింగ్స్‌ని ఈ కార్యక్రమంలో ప్రదర్శనకు పెట్టబోతున్నారు.

ఈసారి కార్యక్రమంలో గ్రాటిడ్యూట్ ఈజ్ గ్రేట్, మీ భవిష్యత్తు మీ ఆశయాల్లో, పరీక్షల పరిశీలన, మా విధులు-మీ నిర్వహణ, బ్యాలెన్స్ ఈజ్ బెనిఫీషియల్ వంటి థీమ్స్ ఎంపిక చేశారు. 9 నుంచీ 12 తరగతులకు చెందిన 2000 మంది విద్యార్థుల్ని ప్రశ్నలు అడిగేందుకు ఎంపిక చేశారు. పరీక్షలపై విద్యార్థులు వేసే ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెబుతారు.

గతేడాది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1.4 లక్షల ఎంట్రీలు రాగా... ఈసారి 2.6 లక్షల ఎంట్రీస్ వచ్చాయి. 2018లో మోదీ... 10 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. 2019లో 16 ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. ఈ సంవత్సరం ఎన్ని ప్రశ్నలు ఎదురవుతాయన్నది ఆసక్తికరం.

First published: January 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు