Home /News /national /

IN 1ST MANN KI BAAT AFTER BJP SWEEP IN POLLS PM MODI PITCHES LOCAL GOING GLOBAL ACHIEVE EXPORT TARGET OF USD 400 MILLION MKS

PM Modi: భారత్ ఎగుమతుల జోరు.. ఆయన వల్లే ఖ్యాతి ఖండాంతరాలకు: Mann ki Baatలో మోదీ

ప్రధాని మోదీకి యోగా గురువు బాబా శివానంద వందనం (గత వారం ఫొటో)

ప్రధాని మోదీకి యోగా గురువు బాబా శివానంద వందనం (గత వారం ఫొటో)

భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులు అద్బుత రీతిలో వృద్ధి సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ ఇప్పటికే 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించిందని ప్రకటించారు.

బీజేపీ సర్కార్ అనుసరిస్తోన్న ‘వోకల్ ఫర్ లోకల్’, ‘లోకల్ గోయింగ్ గ్లోబల్’ వంటి విధానాల వల్ల భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులు అద్బుత రీతిలో వృద్ధి సాధించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ ఇప్పటికే 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించిందని ప్రకటించారు. ఆదివారం నాటి 87వ ఎపిసోడ్ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల పద్మ అవార్డుల ప్రదానం సమయంలో యోగా గురువు బాబా శివానంద వందన సమర్పణ సందర్భాన్ని కూడా మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.

భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించిందని, ఇది దేశ సామర్థ్యాన్ని సూచిస్తున్నదని, ప్రపంచంలో భారతీయ వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని అర్థమవతుతున్నదని మోదీ చెప్పారు. ప్రభుత్వ ఈ- మార్కెట్‌ప్లేస్ పోర్టల్ (GeM) పోర్టల్ ద్వారా ప్రభుత్వం వస్తువులను కొనుగోలు చేసిందని, దాదాపు 1.5 లక్షల మంది చిన్న వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తిని నేరుగా ప్రభుత్వానికి విక్రయిస్తున్నారని మన్ కీ బాత్ లో మోదీ హైలైట్ చేశారు.

Modi Story: మోదీ ఎవరో తెలీదంటూ పోలీసులకే మోదీ మస్కా.. PM Modi జీవితంలో అనూహ్య ఘట్టాలివే..


‘ఇంతకుముందు, పెద్ద వ్యక్తులు మాత్రమే ప్రభుత్వానికి ఉత్పత్తులను విక్రయించగలరని విశ్వసించేవారు, కానీ ప్రభుత్వ ఈ-మార్కెట్ పోర్టల్ ఈ వైఖరినిమార్చింది; ఇది నూతన భారతదేశ స్ఫూర్తిని చూపుతుంది’ అని అన్నారాయన. భారత్ లోని ప్రతి పౌరుడు స్థానిక ఉత్పత్తులను ఆదరిస్తే..దేశం ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేమి కాదని ప్రధాని పేర్కొన్నారు.

ఇటీవల పద్మా అవార్డుల ప్రదానోత్సవంలో యోగా గురువు బాబా శివానందను చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారని..ఈ వయసులోనూ ఆయన ఆరోగ్యం, శారీరక దృఢత్వం యోగాతోనే సాధ్యమైందని తెలిపినట్లు ప్రధాని మోదీ వివరించారు. శివానంద బాబా వంటి వారి అనుసరణ కారణంగానే నేడు యోగా భారత్ నుంచి ఖండాంతరాలకు విస్తరించిందని మోదీ వివరించారు. అదే సమయంలో ఆరోగ్య రంగంలో ఇటీవల ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరిగిందని.. అనేక చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఈ రంగంలో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకున్నట్లు మోదీ తెలిపారు.

PM Modi: ధరల బాదుడు వేళ కేంద్రం ఔదార్యం.. ఆ పథకం మరో6నెలలు పొడగింపు..


గుజరాత్ లో పుట్టిపెరిగిన వ్యక్తిగా అక్కడ నీటి ఎద్దడి గురించి బాగా తెలుసని, జల్ మందిర్ యోజన కార్యక్రమం ద్వారా ప్రతి నీటిబొట్టుని ఒడిసిపట్టి గుజరాత్ లో నీటి కరువును అధిగమిస్తున్నామని, గుజరాత్ కోస్తా తీరంలో జరిగే అద్భుతమైన ఉత్సవాలు “ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్”ను ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ లో బాలికా చదువును, మహిళా సాధికారతను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజలకు సూచించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Exports, Mann Ki Baat, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు