ప్రపంచమంతా భారత్ వెంటే.. పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్

ఇమ్రాన్ ఖాన్ చేసిన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మంత్రి ఇజాజ్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమను ఎవరూ నమ్మడం లేదని వాఖ్యానించారు.

news18-telugu
Updated: September 13, 2019, 3:36 PM IST
ప్రపంచమంతా భారత్ వెంటే.. పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ మ్యాప్
  • Share this:
ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై ఎన్నో కుట్రలు చేస్తోంది పాకిస్తాన్. అంతర్జాతీయ వేదికపై ఇండియాను దోషిగా నిలబెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో పాక్ మంత్రి ఇజాజ్ అహ్మద్ షా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు దిమ్మ దిరిగిలే సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంలో యావత్ ప్రపంచం భారత్‌ వాదననే సమర్థిస్తోందని.. పాకిస్తాన్‌ను ఎవరూ నమ్మడం లేదని స్పష్టంచేశారు. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఫెయిలైందని పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్‌ను తప్పుబట్టారు.

కశ్మీర్‌లో కర్ఫ్యూ విధించారు. మెడిసిన్స్ లేకుండా కశ్మీరీలు ఇబ్బందులు పడుతున్నారు. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనం జరుగుతోందని మేం చెబుతూనే ఉన్నాం. కానీ మా మాటని ఎవరూ నమ్మడం లేదు. ప్రపంచమంతా భారత్‌నే విశ్వసిస్తోంది.
ఇజాజ్ అహ్మద్, పాక్ మంత్రి
ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి (UNHRC)లో ప్రపంచ దేశాలు పాకిస్తాన్‌కే మద్దతిచ్చాయని ఇమ్రాన్ ఖాన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. కశ్మీర్ అంశంలో 58 దేశాలు తమకు మద్దతిచ్చాయని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన చేసిన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే మంత్రి ఇజాజ్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమను ఎవరూ నమ్మడం లేదని వాఖ్యానించారు.
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు