పాక్ ఓవరాక్షన్...భారత విమానాలకు శాశ్వతంగా నో ఎంట్రీ

అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే విమానాలకు దూరం పెరగడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది.

news18-telugu
Updated: August 27, 2019, 10:56 PM IST
పాక్ ఓవరాక్షన్...భారత విమానాలకు శాశ్వతంగా నో ఎంట్రీ
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
  • Share this:
ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఎల్‌వోసీ వెంబడి చెలరేగుతూనే..భారత్‌ను రెచ్చగొడుతోంది. అంతర్జాతీయ వేదికపై దోషిగా నిలబెట్టేందుకు కుట్ర చేస్తోంది. ఈ క్రమంలో భారత్‌తో సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సంఝౌతా, థార్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దుచేసిన పాక్.. లాహోర్-ఢిల్లీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేసింది. అంతేకాదు పాక్ గగనతలాన్ని భారత్‌కు శాశ్వతంగా మూసివేయాలని భావిస్తోంది అక్కడి ప్రభుత్వం. భారత్ నుంచి వచ్చే విమానాలను తమ దేశ గగనతలంలో నిషేధించేందుకు యోచిస్తోంది. ఆ అంశాన్ని ఇమ్రాన్‌ పరిశీలిస్తున్నారని పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ తెలిపారు.
అంతేకాదు ఇండియా-ఆప్ఘనిస్తాన్ మధ్య వాణిజ్యం కోసం పాకిస్తాన్ రోడ్లను వినియోగిస్తున్నారని..ఇకపై ఆ మార్గాల్లో భారత్‌ని నిషేధించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. మోదీ ఆరంభించారని..ఇక మేం ముగిస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు హుస్సేన్. కాగా, భారత్ నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే విమానాలు పాక్ గగన తలం మీదుగానే రాకపోకలు సాగిస్తుంటాయి. రోజూ 50 ఎయిర్ ఇండియా విమానాలు పాక్ గగనతలం మీదుగా ప్రయాణిస్తుంటాయి. తమ గగనతలం మీదుగా భారత విమానాలను పాకిస్తాన్ నిషేధం విధిస్తే..ఆ విమానాలన్నీ అరబ్ దేశాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అమెరికా, యూరప్ దేశాలకు వెళ్లే విమానాలకు దూరం పెరగడంతో పాటు ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది.First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>