Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    సిద్దును వెనకేసుకొచ్చిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్..!

    హగ్ వివాదంపై స్పందించిన సిద్దు బీజేపీపై ఎదురుదాడికి దిగారు. అదొక భావోద్వేగ సందర్భమని వివరణ ఇచ్చారు. తనది రాజకీయ పర్యటన కాదని..స్నేహం కోసమే అక్కడికి వెళ్లినట్లు చెప్పారు.

    news18-telugu
    Updated: August 22, 2018, 8:08 PM IST
    సిద్దును వెనకేసుకొచ్చిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్..!
    సిద్దు, ఇమ్రాన్ ఖాన్
    • Share this:
    పాక్ ఆర్మీ చీఫ్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్దు హగ్‌పై దుమారం కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ..స్వయంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎపిసోడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తన మిత్రుడు సిద్దుకు మద్దతుగా నిలిచారు. ఆయన శాంతిదూత అని ప్రశంసించారు. సిద్దును విమర్శించే వాళ్లంతా.. శాంతికి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని చురకలంటించారు. శాంతి లేకుంటే ఇరుదేశాల ప్రజలు అభివృద్ధి సాధించలేరని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ప్రజలు సిద్దుపై ప్రేమాభిమానాలు చూపించారని ఇమ్రాన్ ఖాన్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

    అంతేకాదు ఇరుదేశాల మధ్య వివాదాలు, కాశ్మీర్ సమస్యకు చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఉపఖండంలో పేదరికాన్ని నిర్మూలించి ప్రజాభివృద్ధి సాధించాలంటే ఇండియా,పాకిస్తాన్ మధ్య చర్చలు జరగాలని, వ్యాపార సంబంధాలు పెరగాలని అభిప్రాయపడ్డారు.


    మరోవైపు హగ్ వివాదంపై స్పందించిన సిద్దు బీజేపీపై ఎదురుదాడికి దిగారు. అదొక భావోద్వేగ సందర్భమని వివరణ ఇచ్చారు. కర్తాపూర్ సాహిబ్‌‌ (పాకిస్తాన్‌లో ప్రముఖ గురుద్వారా)కు కారిడార్‌ని తెరిచేందుకు కృషిచేస్తున్నట్లు పార్టీ ఆర్మీ చీఫ్ భజ్వా తనతో చెప్పారని..ఆ క్రమంలోనే ఆయన్ను కౌగిలించుకున్నట్లు తెలిపారు. తనది రాజకీయ పర్యటన కాదని..స్నేహం కోసమే అక్కడికి వెళ్లినట్లు చెప్పారు.

    సిద్దు వివరణ ఇచ్చినా బీజేపీ విమర్శల దాడి ఆగలేదు. సిద్దు అడిగిన వాటికి సమాధానం ఇవ్వకుండా.. ఏదో లెక్చర్ ఇచ్చారని బీజేపీ నేతలు మండిపడ్డారు. పాకిస్తాన్‌కు మద్దతుగా సిద్దు ప్రెస్ మీట్ ఎలా నిర్వహించారో..రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు మన సైనికులను పాకిస్తాన్ చంపుతోంటే..మరోవైపు ఆ దేశ ఆర్మీ చీఫ్‌ని సిద్దు ఎలా కౌగించుకుంటారని విరుచుకుపడ్డారు.
    Published by: Shiva Kumar Addula
    First published: August 21, 2018, 9:34 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading