Mental Health: కరోనా ఎంత పనిచేశావు... చిన్న,పెద్ద అందర్ని ఖతం చేస్తున్న మహమ్మారి !

Mental Health: కరోనా ఎంత పనిచేశావు... చిన్న,పెద్ద  అందర్ని ఖతం చేస్తున్న మహమ్మారి !

familes

కరోనా మహమ్మారి రెండో దశలో వేగంగా వ్యాపిస్తోంది. రూపం మార్చుకుంటున్న వైరస్, మరింత ప్రమాదకరంగా మారుతుంది. కొత్త వేరియంట్ల వ్యాప్తి

  • Share this:
కరోనా మహమ్మారి రెండో దశలో వేగంగా వ్యాపిస్తోంది. రూపం మార్చుకుంటున్న వైరస్, మరింత ప్రమాదకరంగా మారుతుంది. కొత్త వేరియంట్ల వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండటంతో కుటుంబంలో ఒకరికి వైరస్ సోకినా.. కొద్ది సమయంలోనే అందరికీ పాజిటివ్ వస్తోంది. దీంతో తమవల్లే కుటుంబ స‌భ్యులు కూడా వ్యాధి బారినప‌డి ప్రాణాలు కోల్పోతున్నారనే అప‌రాధ భావం ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది. ఇప్పటికే మహమ్మారితో మరణించినవారి కుటుంబ సభ్యులు మానసికంగా కుంగిపోతున్నారు. యువకులు, పెద్దవాళ్లనే తేడా లేకుండా కుటుంబాల్లో వ్యక్తులను కోల్పోయిన ఎంతోమంది ఇప్పుడు ఇలాంటి మానసిక సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి వారిని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతున్నారు నిపుణులు.

ఇటీవల ఒక యువ ఇంజినీర్‌కు కొవిడ్‌-19 సోకింది. తరువాత వైరస్ త‌న సోద‌రికీ సోకడంతో, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అతడు నిరాశ‌, ఆందోళ‌న‌కు గురై చికిత్స తీసుకుంటున్నాడు. త‌న సోద‌రి మ‌ర‌ణానికి తానే కార‌ణ‌మంటూ కుమిలిపోతున్నాడు. విధుల్లో భాగంగానే తనకు వైరస్ సోకిందని అతడు భావిస్తున్నాడు. అసలు ఇంటికే వెళ్ల‌కుండా ఉంటే తన సోదరి బాగుండేదేమో అని మదనపడుతున్నాడు. తండ్రిని కోల్పోయిన కూతురు, భార్యను కోల్పోయిన భర్త.. ఇలా ఎందరో తమవల్ల ఆప్తులు చనిపోయారనే అపరాధ భావంతో కుంగిపోతున్నారు. వారి మాన‌సిక ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న త‌ర్వాత కూడా వీరు మామూలు స్థితికి రాలేకపోతున్నారు. ఇలాంటి వారిలో కొందరు మాన‌సిక వైద్యుల స‌హాయం కోరుకుంటున్నారు.

దుఖం నుంచి అప‌రాధ భావం వ‌స్తుంద‌ని చెబుతున్నారు సైకాల‌జిస్ట్‌లు. ఇది ఎక్కువ కాలం కొన‌సాగితే ఇతర ప్ర‌మాదానికి దారితీస్తుంది. బాధితులు ఆత్మ‌హ్య‌త్య చేసుకునే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. నిజానికి ఈ దుఖం అనేది తిర‌స్క‌రించ‌డం నుంచి మొద‌ల‌వుతుంది. త‌ర్వాత కోపం, ఆ త‌ర్వాత నిరాశ‌, దీని త‌ర్వాత మెద‌డు పున‌ర్నిర్మించుకోవ‌డం మొద‌ల‌వుతుంది. చివ‌రిగా అంగీక‌రించే ద‌శ‌కు చేరుకుంటుంది. అయితే అంద‌రూ ఈ ద‌శ‌లను విజ‌య‌వంతంగా దాటుకుంటూ రాలేరు. వీరిలో కొందరికి కాగ్నిటివ్ థెర‌పీ అవ‌స‌ర‌మ‌వుతుంది.

సాధార‌ణంగా ఇలాంటి కేసుల్లో పేషెంట్లు.. మొద‌టి నుంచి ద‌శ‌ల వారీగా జ‌రిగిన విషయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. కుటుంబంలో మొట్ట‌మొద‌టి పాజిటివ్ నిర్ధార‌ణ అయిన వారే ఎక్కువ అప‌రాధ భావంతో ఉంటారు. ఇంత‌టి న‌ష్టం జ‌ర‌గ‌డానికి కార‌ణం తాను చేసిన‌ త‌ప్పేన‌ని, త‌న‌ నిర్ల‌క్ష్య‌మేన‌ని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి వారిని గుర్తించి సకాలంలో నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. కొందరి దృష్టిని ఆధ్యాత్మికత వైపుకు మళ్లించడం ద్వారా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల మీ బంధుమిత్రుల్లో ఎవరైనా ఇలాంటి స్థితిలో ఉంటే.. నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి.
First published:

అగ్ర కథనాలు