ఇప్పటికే దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రతి రోజూ వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఐతే ఈ వర్షాలు మరిన్ని రోజులు ఉంటాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఆగస్టు 12 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఆగస్టు 12న ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భా, గుజరాత్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముంది.
హిమాచల్ ప్రదేశ్, బీహార్, చత్తీస్గఢ్, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఒడిశా, అసోం, మేఘాలయ, మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఘాట్ ప్రాంతాలు, కొంకణ్, గోవా, తెలంగాణ, కోస్టల్ కర్నాటకలో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక యూపీ, ఈస్ట్ రాజస్థాన్, బీహార్, ఝార్ఖండ్ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు. నైరుతి, పశ్చిమ మధ్య అరేబియా తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Floods, Heavy Rains, Monsoon rains, South West Monsoon