IMD AGAIN WARNS TAMIL NADU OVER HEAVY RAINS WORK FROM HOME IN GOVT OFFICES PM MODI CALLS CM STALIN ASSURES SUPPORT MKS
దేవుడా.. ఇప్పుడెలా? : జలవిలయ Tamil Naduలో మళ్లీ భీకర వర్షాలు -IMD తాజా వార్నింగ్ -Chennaiలో వరద బీభత్సం
చెన్నైలో వరద బీభత్సం
భారీ వర్షాలు, వరదతో ఇప్పటికే చెన్నై నగరం నీట మునిగిపోగా, తమిళనాడుకు మరో పిడుగులాంటి హెచ్చరిక చేసింది భారత వాతావరణ విభాగం. బంగాళాఖాతంలో ఈనెల 9న అల్పపీడం ఏర్పడి, అది వాయుగుండంగా మారుతుందని, దీంతో రాబోయే రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది..
ఆరేళ్ల కిందటి అసాధారణ పరిస్థితుల్ని తలపిస్తూ తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై నగరంతోపాటు పలు జిల్లాలు ఇప్పటికే నీట మునిగాయి. జనజీవంన పూర్తిగా స్తంభించిపోయి, లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ జలవిలయం చాలదన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా తమిళనాడుకు మరో రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజులపాటు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. ఐఎండీ తాజా ప్రకటనతో ప్రజలతోపాటు సహాయ కార్యక్రమాల్లో ఉన్న సిబ్బంది కూడా ఆందోళనలకు గురవుతున్నారు.
తమిళనాడు వ్యాప్తంగా శనివారం నుంచి వానలు కురుస్తుండగా, ఆదివారం కుండపోతతో చెన్నై నగరం నీట మునిగింది. చెన్నైతోపాటు శివారు ప్రాంతాల్లో జలవిలయ దృశ్యాలు కనిపించాయి. కాగా, బంగాళాఖాతంలో ఈనెల 9న అల్పపీడం ఏర్పాడనుందని, అది వాయుగుండగా మారుతుందని, తద్వారా రాష్ట్రంలో రాబోయే రెండు రోజులపాటు అతి తీవ్ర వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది.
భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే చెన్నైలో లోకల్ రైళ్లు, రవాణా వ్యవస్థను దాదాపు పూర్తిగా స్తంభింపజేశారు. నాలుగు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలను మూసేశారు. సోమవారం ఉదయం తాజాగా వెలువడిన ప్రకటనలో.. ప్రభుత్వ ఉద్యోగులెవరూ కార్యాలయాలకు రావొద్దని, వీలును బట్టి ఇళ్ల నుంచే పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తమిళనాడు జల విలయంలో చిక్కుకున్న ప్రజలను కేంద్ర, రాష్ట్రాల సహాయక బృందాలు రెస్క్యూ చేస్తున్నాయి. ఆరేళ్ల తర్వాత చెన్నై నగరం మునిగిపోవడం, తమిళనాడు అంతటా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో కేంద్రం సైతం అప్రమత్తమైంది. తమిళనాడులో వరద పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు ఫోన్ చేసిన మోదీ.. సహాయక కార్యక్రమాలు, తక్షణ ఉపశమనం కోసం కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.