జూన్ 17న దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె

17వ తేదీన సమ్మె సందర్భంగా అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని ఐఎంఏ ప్రకటించింది.

news18-telugu
Updated: June 14, 2019, 5:21 PM IST
జూన్ 17న దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె
బెంగాల్‌లో జూడాల ధర్నా
news18-telugu
Updated: June 14, 2019, 5:21 PM IST
ఈనెల 17వ తేదీన దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. కోల్‌కతాలో జూనియర్ వైద్యుల మీద జరిగిన దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. పశ్చిమ బెంగాల్లోనే కాకుండా దేశం మొత్తం ప్రభుత్వ వైద్యులు విధులు బహిష్కరించి నిరసనలు చేస్తున్నారు. 17వ తేదీన సమ్మె సందర్భంగా అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని ఐఎంఏ ప్రకటించింది. శాంతియుత ప్రదర్శనలు మాత్రమే చేస్తామని తెలిపింది. ‘వైద్యులు చందమామను తీసుకొచ్చి ఇవ్వమనడం లేదు. కనీస భద్రత కల్పించమని కోరుతున్నారంతే. అది అసాధ్యమేం కాదు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు.’ అని ఐఎంఏ ప్రకటించింది. సమ్మెలో 3.5లక్షల మంది వైద్యులు పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో వైద్యుల సమ్మెకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం మీద ప్రభుత్వం వైఖరి స్పష్టం చేయాలంటూ కలకత్తా హైకోర్టు బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని సూచించింది. వైద్యుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. దీనికి వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించింది.

First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...