హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

‘లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను.. ’.. కీలక వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్

‘లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ను.. ’.. కీలక వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీష్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (ఫైల్)

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (ఫైల్)

Bihar: రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఫుల్‌పూర్ పార్లమెంటరీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికలలో బరిలో ఉంటాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని, బీహార్ సీఎం అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

వచ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో యూపీలోని ఫుల్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి బీహార్ (Bihar)  ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బరిలో ఉంటారని కొన్నిరోజులుగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీనికి ప్రధానంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. నితీష్ కుమార్ ను తాము పూర్తి స్థాయిలో తమ మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా.. ఆయన ఎక్కడ నుంచి పోటీ తాము సపోర్ట్ చేస్తామని తెలిపారు.

అయితే.. ఈ వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish kumar)  కొట్టిపారేశారు. తాను.. కేవలం 2024 ఎన్నికల వరకు విప‌క్ష‌ పార్టీలన్నింటిని ఒకతాటి పైకి తెవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గద్దెదించడమే తమ టార్గెట్ అని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. బీజేసీ దర్యాప్తు సంస్థలను, ఉసిగొల్పి విప‌క్ష‌ పార్టీలను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు.

అదే విధంగా , దేశంలో రెండు వర్గాల మధ్య గొడవలు క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధిపొందాలని భావిస్తోందని నితీష్ కుమార్ తీవ్ర స్థాయిలో ఎద్దెవా చేశారు. ఇదిలా ఉండగా.. పూల్పూర్ నుంచి నితీష్ కుమార్ పోటీ చేయాల‌ని, ఆ నియోజ‌క‌వర్గానికి చెందిన జేడీ(యూ) శ్రేణులు నితీష్‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

ఇదిలా ఉండగా  కేంద్ర మంత్రి నారాయణ్ రాణేకు బాంబే హైకోర్టు షాకిచ్చింది.

ఆయన అక్రమంగా బాంబేలోని జూహు ప్రాంతంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో.. నారాయణ రాణే నిబంధలను విరుద్ధంగా నిర్మాణం చేపట్టినట్లు (ఎఫ్‌ఎస్‌ఐ) తెలింది. అంతే కాకుండా ఆయన, ఫ్లోర్ స్పెస్ ఇండెక్స్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సిఆర్‌జెడ్) నిబంధనలను ఉల్లంఘించి ఇంటిని నిర్మించారని పేర్కొంటూ దాన్ని వెంటనే కూల్చివేయాలని ముంబై పౌరసరఫరాల సంస్థను బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశించింది.

రెండు వారాల వ్యవధిలో అనధికార భాగాలను కూల్చివేసి, ఒక వారం తర్వాత కోర్టుకు సమ్మతి నివేదికను సమర్పించాలని కోర్టు BMCని ఆదేశించింది. అంతే కాకుండా.. విచారణ చేపట్టిన హైకోర్టు బెంచ్ మిస్టర్ రాణేపై ₹ 10 లక్షలు విధించింది. ఆ మొత్తాన్ని రెండు వారాల్లోగా మహారాష్ట్ర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి జమ చేయాలని ఆదేశించింది. దీనిపై నారాయణ్ రాణే తరపు న్యాయవాది శార్దూల్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా ఆరు వారాల పాటు హైకోర్టు తన ఉత్తర్వులను నిలిపి వేయాలని కోరారు. అయితే బెంచ్ దానిని తోసిపుచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనతో రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Elections, Nitish Kumar

ఉత్తమ కథలు