Home /News /national /

IIT Madras Survey: మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు అక్క‌డే అధికం.. IIT మద్రాస్ అధ్యయనం

IIT Madras Survey: మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు అక్క‌డే అధికం.. IIT మద్రాస్ అధ్యయనం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

IIT Madras Survey | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) మద్రాస్ పరిశోధకులు మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లపై స‌ర్వే చేసింది. ఈ స‌ర్వే ప్ర‌కారం దేశంలో ఎక్క‌డ ఎక్కువ మంది మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు ఉన్నారో తెలిపింది.

ఇంకా చదవండి ...
    మ‌హిళా సాధికార‌త.. దేశంలో అంద‌రు కోరుకొనేది అదే. మ‌హిళ‌లు త‌మ సామ‌ర్థ్యాల‌ను గుర్తించి ఎద‌గాల‌ని అంద‌రూ ఆకాంక్షిస్తున్నారు. అయితే అది ఆచ‌ర‌ణ‌లో ఎంత వ‌ర‌కు సాధ్య‌మైంది అనేది ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త‌లేదు. అయితే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Indian Institute of Technology) మద్రాస్ పరిశోధకులు మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లపై స‌ర్వే చేసింది. ఈ స‌ర్వే ప్ర‌కారం దేశంలోని రాష్ట్రాల్లోని మ‌హిళ‌ల కంటే త‌మిళ‌నాడులోనే మ‌హిళా ప‌రిశ్రామిక వేత్త‌లు ఎక్కువ మంది ఉన్నార‌ని స‌ర్వేలో వెల్ల‌డైన‌ట్టు పేర్కొంది. 2019 సెప్టెంబర్ మరియు డిసెంబర్ మధ్య తమిళనాడులో ఈ అధ్యయనం జరిగింది. ప్ర‌స్తుతం ఈ సంఖ్య ఇంక ఎక్కువ‌గా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతుంది. తమిళనాడు (Tamil Nadu) లోని మహిళా పారిశ్రామికవేత్తలు (Women Entrepreneurs) తమ వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి, ఎదగడానికి వారి సామర్థ్యం, అనుభవం, నెట్‌వర్కింగ్ అవకాశం, కుటుంబం నుంచి మద్దతు వంటి అనేక అంశాలు సహాయపడతాయని కూడా అధ్యయనం వెల్లడించింది.

    వ్యాపారంలోకి రావ‌డానికి కార‌ణం..
    మహిళా వ్యాపారవేత్తలు వ్యాపారంలోకి ప్రవేశించడానికి ప్రేరేపించే ముఖ్య‌మైన కార‌కాలు ముఖ్యంగా వ్యాపారంపై మ‌హిళ‌ల‌కు అభిరుచి, కొత్తదాన్ని సృష్టించాలనే ప్రేరణ, సవాళ్ల పట్ ఆస‌క్తి, సామాజిక విలువల సృష్టి, పని-జీవిత సమతుల్యత కోసం కోరిక, జీవిత భాగస్వామి, కుటుంబం నుంచి సామాజిక మద్దతు, ప్రభుత్వ సహాయం మరియు సబ్సిడీలు వంటి మద్దతు .. వంటివి మ‌హిళా పారిశ్రామికేవ‌త్త‌లు త‌యారు కావ‌డానికి కార‌ణాలుగా ఐఐటీ మ‌ద్రాస్ (IIT Madras) పేర్కొంది.

    Supreme Court: అదేం ప్రైవేటు ఆస్తి కాదు.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై పిటిష‌న్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు


    ఆదాయం త‌క్కువ ఉన్నా.. ఆస‌క్తే
    ఆరవ ఆర్థిక గణన (2016) యొక్క ఆల్ ఇండియా రిపోర్ట్, మహిళా పారిశ్రామికవేత్తలు తమ మార్గాన్ని ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లోకి ఎందుకు ఎంచుకున్నారు.. అనే అంశ‌పై ఐఐటీ మ‌ద్రాస్ స‌ర్వే చేసింది.
    ఆదాయం - లాభం సాధారణంగా తక్కువగా ఉన్నప్పటికీ, మహిళా పారిశ్రామికవేత్తలు తాము సంతృప్తిగా ఉన్నారని, వారు వ్యాపారాన్ని కొనసాగించడంలో విశ్వాసాన్ని చూపుతున్నారని స‌ర్వేలో వెల్ల‌డైంది. చాలా మంది మహిళా వ్యాపారవేత్తలు వ్యాపారాన్ని కలిగి ఉండటం వల్ల ఇతరుల శ్రేయస్సును ప్రభావితం చేసే అవకాశాన్ని కలిగి ఉండటానికి వారికి ఆర్థిక భద్రత, కెరీర్ సంతృప్తి, సౌకర్యవంతమైన పని గంటలు, సంతోషం యొక్క భావాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

    యూనిసెఫ్ స‌ర్వే..
    విద్యాప్ర‌మాణాలు పాటించ‌డంలో భార‌త్‌ మెరుగ్గా ఉందని యూనేటెడ్ నేష‌న్స్ చిల్డ్ర‌న్ ఫండ్ (United Nations Children's Fund) పేర్కొంది. అంతే కాకుండా ఇండియాకు సంబంధించి మ‌రో స‌ర్వేను యూనిసెఫ్ (UNICEF) విడుద‌ల చేసింది. పాఠ‌శాల‌లు మూసివేయ‌డం వ‌ల్ పిల్ల‌ల చ‌దువుపై ప‌డిన ప్ర‌భావం ఎలా ఉందో స‌ర్వే (Survey) వివ‌రాలు వెల్ల‌డించింది. క‌రోనా కార‌ణంగా భార‌త్‌లో 5-13 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల తల్లిదండ్రులలో 76 శాతం మంది మరియు 14-18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో 80 శాతం మంది స్కూళ్లు మూసి ఉండ‌డం వ‌ల్ల చ‌దువ‌పై ప్ర‌భావం ప‌డింద‌ని పేర్కొన్న‌ట్టు వెల్ల‌డించింది. అంతే కాకుండా 10శాతం మంది విద్యార్థులు అస‌లు స్మార్ట్‌ఫోన్ వాడ‌లేద‌ని స‌ర్వేలో వెల్ల‌డైంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Business woman, IIT Madras, Survey, WOMAN

    తదుపరి వార్తలు