హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Crop Protection: రైతులకు వరం.. పొలానికి కాపలాగా సరికొత్త పరికరం.. ఇది ఉంటే పంట సేఫ్..

Crop Protection: రైతులకు వరం.. పొలానికి కాపలాగా సరికొత్త పరికరం.. ఇది ఉంటే పంట సేఫ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీ పూర్వ విద్యార్థి తన స్టార్టప్ ద్వారా అధునాతన పరికరాన్ని అభివృద్ధి చెశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ఈ సాధనం.. జంతువులు, దొంగలు పొలంలోకి వచ్చినప్పుడు ఇది అలారంలా అరవడమే కాకుండా రైతుల ఫోన్ నెంబర్లకు అలర్టులను పంపిస్తుంది

ఇంకా చదవండి ...

మనదేశంలో రైతుల సమస్యల గురించి ఎంత చెప్పినా తక్కువే. పంట చేతికొచ్చేంత వరకు కంటికి రెప్పాలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీహార్ లాంటి రాష్ట్రాల్లో జంతువుల తాకిడి, దొంగల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జంతువుల ద్వారా పంట చేతికి రాకపోవడం, దొంగల బెడదతో నష్టం రావడం అక్కడ పరిపాటిగా మారింది. ఈ సమస్యలకు పరిష్కారం చూపాలనుకున్నాడు ఓ ఐఐటీ పూర్వ విద్యార్థి. తన స్టార్టప్ ద్వారా అధునాతన పరికరాన్ని అతడు అభివృద్ధి చెశాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే డివైజ్‌ను తయారు చేశాడు. దీని ద్వారా జంతువులు, దొంగలు పొలంలోకి వచ్చినప్పుడు ఇది అలారంలా అరవడమే కాకుండా రైతుల ఫోన్ నెంబర్లకు అలర్టులను పంపిస్తుంది.

ఎలా పనిచేస్తుంది..

ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి అయిన అజిత్ కుమార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రైవెన్ ఫామ్ సర్విలెన్స్ కమ్ యానిమల్ స్కారర్ (FSCAS) అనే డివైజ్‌ను అభివృద్ధి చేశాడు. కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ పరికరాన్ని పొలంలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో ఇన్ స్టాల్ చేస్తారు. జంతువులు, దొంగలు వచ్చినప్పుడు ఇది అలారం మాదిరిగా అరుస్తుంది. అంతేకాకుండా రైతుల ఫోన్లకు అలర్టులను పంపిస్తుంది. ఫలితంగా పంటకు నష్టం వాటిల్లకుండా రైతులు చర్యలు తీసుకోవచ్చు. ఆర్టిఫిషియ్ ఇంటెలిజెన్స్ తో పాటు కంప్యూటరైజ్డ్ సెన్సార్లను ఈ పరికరంలో పొందుపరిచారు. వీటితో పాటు రాత్రి పూట కనిపించే కెమెరాలను(night-vision cameras) దీనికి అమర్చారు. బీహార్ లోని బాఘల్పుర్ శ్యాంపుర్ ప్రాంతానికి చెందిన అజిత్ కుమార్, ఓ పెద్ద MNC కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో, ఉద్యోగాన్ని వదిలేసి స్టెపిఫై అనే అంకుర సంస్థను(స్టార్టప్) స్థాపించాడు. తన బ్యాచ్ మేట్ సాగర్ కుమార్ సాయంతో FSCAS డివైజ్ ను తయారు చేశాడు.

ధర ఎంతంటే..

"ఈ పరికరం బ్యాటరీతో నడుస్తుంది. పొలంలో ఏదైనా చెట్టు లేదా స్తంభానికి దీన్ని అమర్చి సోలార్ ప్యానెళ్ల సహాయంతో బ్యాటరీకి ఛార్జ్ చేసుకోవచ్చు. రైతుల అభ్యర్థనల మేరకు దీన్ని కస్టమైజ్ చేశాం. కహల్‌గావ్ సబ్ డివిజన్‌లోని ఖిరిఘాట్ (అంటిచక్) వద్ద ఉన్న పొలాల్లో దీన్ని పరీక్షించాం" అని అజిత్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఈ పరికరం ధర రూ.15,000గా నిర్దేశించినట్లు వెల్లడించాడు.

భవిష్యత్తులో మరిన్ని సెన్సార్లతో డివైజ్..

ఈ పరికరం విశ్వసనీయతను లాలాపుర్, భదర్ పుర్, కహాల్గావ్ లోని చాలా మంది రైతులు ధ్రువీకరించారు. పొలంలోకి ఎవరైనా చొరబాటుకు యత్నిస్తే దీని సెన్సార్ వెంటనే గుర్తిస్తుందని అజిత్ తెలిపాడు. నిఘా పెంచడానికి భవిష్యత్తులో మరిన్ని సెన్సార్లు జోడిస్తామన్నాడు. యువతకు రోబోటిక్స్, STEM, స్టెపిఫై ల్యాబ్స్ లో శిక్షణ ఇస్తామని తెలిపాడు. 2020లో విలేజ్ బేస్డ్ ల్యాబ్స్ ద్వారా కోవిడ్ శానిటైజేషన్ కోసం యూవీసీ శానిటైజర్ రోబోను అభివృద్ధి చేశామని, దీన్ని భారత రైల్వే శాఖ పరీక్షించి ప్రయత్నించిందని స్పష్టం చేశాడు.

Keywords - I

First published:

Tags: Agriculuture, Farmers, Technology

ఉత్తమ కథలు