హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

President Ram Nath Kovind: ఐఐఎమ్‌ పర్మినెంట్ క్యాంపస్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి.. ఆవిష్కరణలో కీలక వ్యాఖ్యలు..

President Ram Nath Kovind: ఐఐఎమ్‌ పర్మినెంట్ క్యాంపస్‌ను ప్రారంభించిన రాష్ట్రపతి.. ఆవిష్కరణలో కీలక వ్యాఖ్యలు..

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) కొత్త పర్మినెంట్ క్యాంపస్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) ఆదివారం ప్రారంభించారు. 

భారతదేశంలో తాజాగా ఓ కొత్త ఐఐఎమ్‌ క్యాంపస్ (IIM Campus) ప్రారంభమైంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) కొత్త పర్మినెంట్ క్యాంపస్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (President Ram Nath Kovind) ఆదివారం ప్రారంభించారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఐఐఎమ్‌ క్యాంపస్(IIM Campus) ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ, “విద్యా సంస్థలు కేవలం విద్య నేర్చుకునే ప్రదేశాలు మాత్రమే కాదు. అవి మనలోని ప్రతి ఒక్కరిలో ఇన్నర్ & హెడెన్(Inner And Hidden) టాలెంట్‌ని బయట పెట్టే ప్రదేశాలు కూడా" అని పేర్కొన్నారు. లైఫ్ పర్పస్, లైఫ్ యాంబిషన్(Life Ambition) మనలో మనం ఆత్మపరిశీలన చేసుకునేందుకు.. తద్వారా మన కలలను నెరవేర్చుకోవడానికి పాఠ్యాంశాలు (Curriculum) దోహదపడతాయని రాష్ట్రపతి చెప్పారు.

“మనం ఇన్నోవేషన్ (Innovation), ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (Entrepreneurship)లను ప్రశంసించే, ప్రోత్సహించే యుగంలో జీవిస్తున్నాం. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రెండూ టెక్నాలజీ ద్వారా మన జీవితాలను సులభతరం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి చాలా మందికి ఉపాధి అవకాశాలను కూడా అందించగలవు." అని నాగ్‌పూర్‌లోని ఐఐఎమ్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్రపతి తెలిపారు. నాగ్‌పూర్‌ ఐఐఎమ్‌ (Nagpur IIM) విద్యార్థులను ఉద్యోగార్ధులుగా (Job-seekers) కాకుండా ఉద్యోగ సృష్టికర్తలు (Job-creators)గా మారుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

TSPSC Job Notification: నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC నుంచి త్వరలో మరో జాబ్ నోటిఫికేషన్.. ఖాళీలు, విద్యార్హతలివే

నాగ్‌పూర్‌లోని ఐఐఎమ్‌ దాని సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ద్వారా ఐఐఎమ్‌ నాగ్‌పూర్ ఫౌండేషన్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ (ఇన్‌ఫెడ్)ని స్థాపించడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. ఇన్‌ఫెడ్ (InFED) మహిళా స్టార్టప్ ప్రోగ్రామ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను విజయవంతంగా గ్రాడ్యుయేట్లను చేసిందని, వారిలో ఆరుగురు తమ సంస్థలను ప్రారంభించారని చెప్పారు.

“మన సంప్రదాయాలు ఎల్లప్పుడూ ఇతరులతో అన్నీ పంచుకోవాలని నొక్కి చెప్తున్నాయి. ముఖ్యంగా నాలెడ్జ్ ప్రతి ఒక్కరితో పంచుకోవాలని మన ట్రెడిషన్స్ (Traditions) చెబుతున్నాయి. కాబట్టి, మనం సేకరించిన జ్ఞానాన్ని (Knowledge) పరులతో పంచుకోవడం మన కర్తవ్యం.” అని మే 8న జరిగిన క్యాంపస్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి సూచించారు. ఐఐఎమ్‌ నాగ్‌పూర్ ఐఐఎమ్‌ అహ్మదాబాద్ (IIM Ahmedabad) మార్గదర్శకత్వంలో 2015లో ప్రారంభమయ్యింది. అయితే ఐఐఎమ్‌ నాగ్‌పూర్ టెక్నికల్, మేనేజ్‌మెంట్ లేదా హ్యుమానిటీస్ ఫీల్డ్స్ కోసం కొత్త ఐఐఎమ్‌లు స్థాపించడానికి మార్గదర్శకత్వం అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ సాధికారత, లోక్‌కల్యాణ్‌కు జ్ఞానం ఒక మాధ్యమం అన్నారు. ప్రపంచం భారత్ వైపు ఎంతో ఆశతో చూస్తోందని ఆయన తెలిపారు. IIM నాగ్‌పూర్ చైర్మన్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ CP గుర్నానీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. IIM-N సంస్థ నాగ్‌పూర్ విమానాశ్రయానికి సమీపంలో రూ.500 కోట్ల విలువైన 132 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఇందులో వివిధ శాఖలలో 665 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

First published:

Tags: Iim, Maharashtra, Nagapur, President, Ram Nath Kovind

ఉత్తమ కథలు