హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Tandoori Chai: ఇక్కడ తందూరి చాయ్‌లో డజన్ ఫ్లేవర్స్.. టేస్ట్ చేస్తే వదలరు..!

Tandoori Chai: ఇక్కడ తందూరి చాయ్‌లో డజన్ ఫ్లేవర్స్.. టేస్ట్ చేస్తే వదలరు..!

తందూరి టీ

తందూరి టీ

యూట్యూబ్ నుండి సమాచారం సేకరించి, సబ్ డివిజన్ కార్యాలయం ఎదురుగా ఉన్న తన తండ్రి పాత టీ దుకాణాన్ని కొత్త రూపంలోకి మార్చాడు. మాధేపురాలో ఇలాంటి దుకాణం పనిచేయదని మొదట చాలా మంది అతనికి చెప్పారు.

  • Local18
  • Last Updated :
  • Bihar | Hyderabad

పొద్దున్నే లేచి వేడి వేడి టీ తాగంది చాలామందికి పొద్దు గడవదు. ఉదయం లేచి వేడిగా టీ తాగితే.. ఆ కిక్కే వేరు. కడుపులో తేనీరు పడగానే.. టకటకా అన్ని పనులు చేసేస్తారు. అయితే మీకు టీ అంటే ఇష్టమైతే ఈ వార్త మీకోసమే.పెద్ద నగరాల మాదిరిగానే ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, ఊర్లలో కూడా తందూరీ టీ దొరుకుతుంది. అయితే తందూరి టీనే కాదు... అందులో డజన్ ఫేవర్లు కూడా లభిస్తున్నాయి. అయితే మీరు కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న తందూరి టీ తాగాలంటే... బీహార్ మధేపూర జిల్లా ప్రధాన కార్యాలయంలోని సబ్ డివిజన్ కార్యాలయం ఎదురుగా ఉన్న 'మన్ కా చాయ్' దుకాణానికి వెళ్లాల్సిందే. ఇక్కడ టీ రూ.6 నుంచి రూ.25 వరకు దొరుకుతుంది.. నిజానికి మాధేపురాకు చెందిన కృష్ణ అనే 22 ఏళ్ల యువకుడు యూట్యూబ్‌లో పెద్ద నగరాల తరహాలో వీడియోలు చూసి మాధేపురాలో టీ దుకాణాన్ని ప్రారంభించాడు.

కృష్ణ తండ్రి చిన్న టీ దుకాణం నడిపేవాడు. ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో చదువు పూర్తి చేయలేక ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లాడు. కృష్ణ పెద్ద నగరాల్లో స్టైలిస్ట్ టీ షాపులను చూసినప్పుడు, అతను మధేపురాకు తిరిగి వచ్చి ఆకర్షణీయమైన టీ దుకాణాన్ని తెరవాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం... యూట్యూబ్ నుండి సమాచారం సేకరించి, సబ్ డివిజన్ కార్యాలయం ఎదురుగా ఉన్న తన తండ్రి పాత టీ దుకాణాన్ని కొత్త రూపంలోకి మార్చాడు. మాధేపురాలో ఇలాంటి దుకాణం పనిచేయదని మొదట చాలా మంది అతనికి చెప్పారు. అయినా కూడా అప్పు చేసి మధేపురలో టీ దుకాణం ప్రారంభించాడు కృష్ణ. ఈ రోజుల్లో, కృష్ణ 'మన్ కా చాయ్' దుకాణం వద్ద అన్ని వర్గాల ప్రజలే టీ తాగేందుకు క్యూ కడుతుంటారు.

ఇతర కుటుంబ సభ్యులు కూడా టీ దుకాణంలో సహాయం చేస్తారని కృష్ణ చెప్పారు. దాదాపు ఒకటిన్నర డజను రుచి గల టీలు ఇక్కడ అందుబాటులో ఉన్నప్పటికీ, ముఖ్యంగా మసాలా చాయ్, తందూరీ చాయ్‌లకు చాలా డిమాండ్ ఉందని కృష్ణ చెబుతున్నారు. దీంతో పాటు, పట్టణ ప్రాంతాల ప్రజలు తందూరి టీ పార్సిల్స్‌ను కూడా తీసుకెళ్తారు. అయితే ఇక్కడకు వచ్చే కస్టమర్లు మాత్రం కృష్ణ దుకాణంలో టీ సిప్ చేసి అతని టీని చాలా ప్రశంసిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు టీ దుకాణం రూపురేఖలు కూడా మారాయని, టీ రుచి మరింత బాగుందని అంటున్నారు. క్వాలిటీ కూడా బాగుండటంతో.. దూర ప్రాంతాల నుంచి ప్రజలు తందూరీ టీ తాగడానికి తరలి వస్తుంటారు.

First published:

Tags: Bihar, Food, Tea

ఉత్తమ కథలు