హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ICMR: భారత్‌లో 24 గంటల్లో 3 లక్షలకు పైగా కరోనా కేసులు.. ఈ స్థితిలో ఓ గుడ్‌‌న్యూస్ ఏంటంటే..

ICMR: భారత్‌లో 24 గంటల్లో 3 లక్షలకు పైగా కరోనా కేసులు.. ఈ స్థితిలో ఓ గుడ్‌‌న్యూస్ ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డబుల్ మ్యుటెంట్‌ వైరస్ స్ట్రెయిన్ల కారణంగానే భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో దీన్ని కోవాగ్జిన్ నిరోధిస్తుందా లేదా అనే అంశంపై ICMR ప్రయోగాలు చేస్తోంది. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్.. డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అయిన B.1.617, ఇతర స్ట్రెయిన్లను కూడా సమర్థంగా...

ఇంకా చదవండి ...


దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లపై నెలకొన్న అపోహలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మరో కొత్త వార్త చెప్పింది. దేశీయంగా తయారు చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాగ్జిన్, డబుల్ మ్యుటెంట్‌ వైరస్ స్ట్రెయిన్లపై కూడా సమర్థంగా పనిచేస్తుందని తెలిపింది. డబుల్ మ్యుటెంట్‌ వైరస్ స్ట్రెయిన్ల కారణంగానే భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో దీన్ని కోవాగ్జిన్ నిరోధిస్తుందా లేదా అనే అంశంపై ICMR ప్రయోగాలు చేస్తోంది. భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్.. డబుల్ మ్యూటెంట్ స్ట్రెయిన్ అయిన B.1.617, ఇతర స్ట్రెయిన్లను కూడా సమర్థంగా నిర్వీర్యం చేస్తోందని సంస్థ బుధవారం వెల్లడించింది.

భారత్‌లో కనిపించిన B.1.617 అనే కొత్త రకం వైరస్‌ను ICMR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) శాస్త్రవేత్తలు వేరుచేశారు. దీంట్లో E484Q, L452R అనే ఉత్పరివర్తనాలు ఉన్నాయి. E484Q మ్యుటేషన్‌కు మనుషుల రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉంటుంది. L452R మ్యుటేషన్ వైరస్ వ్యాప్తిని పెంచుతుందని పరిశోధనల్లో కనుగొన్నారు. ఈ మ్యుటేషన్లు రోగులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రకం వైరస్‌ను కూడా కోవాగ్జిన్ సమర్థవంతంగా నిర్వీర్యం చేసినట్లు తమ పరిశోధనలో తేలిందని ICMR స్పష్టం చేసింది. బ్రెజిల్, బ్రిటన్ వైరస్ స్ట్రెయిన్లను సైతం కోవాగ్జిన్ నిరోధిస్తోందని ICMR- NIV పరిశోధకులు ఇంతకు ముందే వెల్లడించడం విశేషం.

ఆందోళన అవసరం లేదు

ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో డబుల్ మ్యుటెంట్ వైరస్ కారణంగానే కేసులు పెరుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. దీన్ని నిర్ధారించుకోవడానికి వైరస్ నమూనాలను జన్యు విశ్లేషణ చేస్తున్నారు. ఈ క్రమంలో గత వారం మహారాష్ట్ర నుంచి జన్యు విశ్లేషణ కోసం పంపిన మొత్తం COVID-19 శాంపిల్స్‌లో దాదాపు 50 శాతం డబుల్ మ్యుటేషన్ వైరస్ ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీంతో B.1.617 అనే ఈ కొత్త వేరియంట్ కేసుల పెరుగుదలకు కారణమవుతోందని నిర్ధారణ అయింది. ఈ వేరియంట్‌ను మరో ఎనిమిది రాష్ట్రాల వైరస్ శాంపిల్స్‌లో కూడా కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ICMR తాజా ప్రకటన B.1.617 స్ట్రెయిన్‌పై నెలకొన్న ఆందోళనను తగ్గిస్తోంది.

వ్యాక్సిన్ తీసుకోవాలి

ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీంతోపాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు. కోవాగ్జిన్, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు రెండూ వైరస్‌ను నిరోధిస్తాయని, ప్రజలు అపోహలు వీడి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

First published:

Tags: Corona, Covaxin