Home /News /national /

ICMR AND OTHER INSTITUTES SHORTLISTED 29 COMPANIES TO MAKE VACCINE FOR MONKEYPOX VIRUS AK

MonkeyPox Vaccine: మంకీపాక్స్ వ్యాక్సిన్ తయారీ.. రేసులో ఉన్న కంపెనీలు ఎన్నో తెలుసా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

MonkeyPox Vaccine: దేశంలో ఇప్పటివరకు 10 మంకీపాక్స్ కేసులు నమోదయ్యారు. ఢిల్లీలోనే ఐదుగురు ఈ వ్యాధి బారిన పడ్డారు. దేశంలోనే తొలిసారిగా మంకీపాక్స్ వ్యాధి కేసు జూలై 14న కేరళలోని కొల్లం జిల్లాలో నమోదైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    దేశంలో మంకీపాక్స్ కేసుకు వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి 29 కంపెనీలు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. దీంతో మంకీపాక్స్ వ్యాక్సిన్‌పై ప్రజల్లో ఆశ పెరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV-పుణె) సహకారంతో వ్యాక్సిన్‌లు, డయాగ్నస్టిక్ కిట్‌లను అభివృద్ధి చేయడానికి 29 ఫార్మా కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేసింది. అయితే 29 కంపెనీలను షార్ట్‌లిస్ట్ చేయడం వల్ల అన్ని కంపెనీలు వ్యాక్సిన్‌ను తయారు చేస్తాయనడానికి లేదు. పత్రాల పరిశీలన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా మాదిరిగానే, ఇప్పుడు మంకీపాక్స్‌కు(MonkeyPox) సంబంధించిన వ్యాక్సిన్ (Vaccine) విషయంలో దేశంలోని రెండు పెద్ద ప్రముఖ కంపెనీల మధ్య పోటీ నెలకొంది. సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, బయోలాజికల్ ఇ, హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్, ముంబై ఇండియన్ ఇమ్యునోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ నుండి దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఫార్మా కంపెనీల నుంచి మొత్తం 31 దరఖాస్తులు అందాయని ఐసీఎంఆర్ తెలిపింది. ICMR గత సమావేశంలో 29 దరఖాస్తులు షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి.

    దేశంలోని 8 ఫార్మా కంపెనీలు కూడా ఐసిఎంఆర్‌కు దరఖాస్తులు పంపగా.. 23 కంపెనీలు టెస్టింగ్ కిట్‌ల తయారీకి ఆసక్తి చూపాయి. యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో గతసారి హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ముందంజలో ఉంది. ఈసారి పూణేలోని సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వ సహకారంతో మంకీపాక్స్ వ్యాక్సిన్‌ను తయారు చేయాలనుకుంటోంది. ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాతో చాలా కంపెనీలు ఆసక్తి చూపాయి.



    ఇక దేశంలో ఇప్పటివరకు 10 మంకీపాక్స్ కేసులు నమోదయ్యారు. ఢిల్లీలోనే ఐదుగురు ఈ వ్యాధి బారిన పడ్డారు. దేశంలోనే తొలిసారిగా మంకీపాక్స్ వ్యాధి కేసు జూలై 14న కేరళలోని కొల్లం జిల్లాలో నమోదైంది. ఇప్పటివరకు భారతదేశంలో ఈ వ్యాధి కారణంగా ఒక రోగి మరణించాడు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్‌లలో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో 31,000కు పైగా మంకీపాక్స్ వ్యాధి కేసులు నమోదయ్యాయి.

    Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్.. అందుకు నిదర్శనం ఈ లెక్కలు..

    Rahul Gandhi: ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఫేస్‌గా రాహుల్ గాంధీ.. ప్లాన్ రెడీ.. ఎందుకంటే..

    మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తికి అధిక జ్వరం, చర్మం దద్దుర్లు (ముఖం నుండి చేతులు, కాళ్ళు, అరచేతులు మరియు అరికాళ్ళ వరకు) ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తికి తలనొప్పి, కండరాల నొప్పి లేదా అలసట, గొంతు నొప్పి దగ్గు ప్రధాన లక్షణాలు. మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తిని సంప్రదించిన 21 రోజులలోపు ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Monkeypox

    తదుపరి వార్తలు