• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • ICAI RECOMMENDED THE GOVERNMENT TO INCREASE THE PPF CONTRIBUTION LIMIT TO RS 3 LAKH BUDGET 2021 NS GH

ICAI Budget Suggestions: రూ. 3 లక్షలకు PPF‌ కాంట్రిబూషన్ లిమిట్‌ పెంపు.. కేంద్రానికి ICAI కీలక సూచన

ప్రతీకాత్మక చిత్రం

Budget 2021: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కాంట్రిబూషన్ లిమిట్‌ను రూ.3 లక్షలకు పెంచాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రభుత్వానికి సూచించింది.

  • Share this:
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కాంట్రిబూషన్ లిమిట్‌ను రూ.3 లక్షలకు పెంచాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రభుత్వానికి సూచించింది. ఈ సంస్థ ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో కొన్ని సెక్షన్లలో మార్పులను సిఫారసు చేసింది. PPF ట్యాక్స్ పరిధిలోకి రాని పెట్టుబడి పథకం. ఉద్యోగులు, వ్యాపారులు అందరూ దీంట్లో పెట్టుబడులు పెట్టవచ్చు. పొదుపు, నష్టభయం లేని పెట్టుబడి మార్గంగా పీపీఎఫ్‌కు మంచి ఆదరణ ఉంది. ఉద్యోగాలు చేసేవారు కాకుండా స్వయం ఉపాధి పనుల్లో ఉన్నవారు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఎంచుకోవచ్చు. ఉద్యోగాలు చేసే వ్యక్తులతో పాటు స్వయం ఉపాధి ఆదాయ మార్గంగా ఉన్నవారు కూడా సమానంగా లబ్ధి పొందటానికి PPF కాంట్రిబూషన్ లిమిట్‌ను రూ.3 లక్షలకు పెంచాలని ఐసీఏఐ కోరుతోంది. ప్రస్తుతం ఒక సంవత్సరానికి PPFలో అత్యధికంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు.

ఉద్యోగాలు చేసేవారి జీతంలో 12 శాతం మొత్తాన్ని యాజమాన్యాలు PPFలో జమ చేస్తాయి. కానీ స్వయం ఉపాధి (self-employed) ఆదాయ మార్గంగా ఉన్నవారికి అందుబాటులో ఉన్న సురక్షితమైన, ట్యాక్స్ పరిధిలోకి రాని పొదుపు, పెట్టుబడి మార్గం PPF ఒక్కటే. అందువల్ల దీంట్లో చేసే కాంట్రిబ్యూషన్ పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని ICAI బడ్జెట్ మెమోరాండంలో తెలిపింది. దీనివల్ల మరిన్ని ఉపయోగాలు ఉన్నాయని ఆ సంస్థ చెబుతోంది. ఈ మార్పులతో దేశీయ పొదుపును పెంచడంతో పాటు, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా తగ్గించవచ్చని ఐసీఏఐ చెబుతోంది. రూ.1,50,000గా ఉన్న పీపీఎఫ్‌ లిమిట్‌ను చాలా సంవత్సరాలుగా పెంచలేదు. దీన్ని ఇప్పటికైనా సమీక్షించాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరుతోంది.

కొత్త బడ్జెట్ కోసం ICAI ప్రతిపాదనలు
PPF కాంట్రిబూషన్ లిమిట్‌ను పెంచడంతో పాటు సెక్షన్ 80C, 80D కింద లభించే డిడక్షన్స్‌లో మార్పులు చేయాలని ఐసీఏఐ చెబుతోంది. 80CCF కింద వర్తించే డిడక్షన్స్‌ లిమిట్‌ను కూడా రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని ఆ సంస్థ ప్రభుత్వానికి సూచించింది.

సెక్షన్ 80డి డిడక్షన్స్‌లో మార్పులు
సెక్షన్ 80D ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని పూర్తిగా ట్యాక్స్ నుంచి మినహాయించాలి. దీన్ని వైద్య ఖర్చుల డిడక్షన్లతో కలపకూడదు. దీని వల్ల ట్యాక్స్ చెల్లించేవారికి సామాజిక భద్రత, వైద్యపరమైన భద్రత లభిస్తుంది. సకాలంలో వైద్య చికిత్స అందించడం ద్వారా ట్యాక్స్ పేయర్ల అవసరాలను తీర్చవచ్చు. సెక్షన్ 80DDB ప్రకారం కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చులకు ఇస్తున్న డిడక్షన్ లిమిట్‌ను పెంచవచ్చు.

సెక్షన్ 80CCCలో మార్పులు
పెన్షన్ ఫండ్‌కు కాంట్రిబూషన్ చేసి, సెక్షన్ 80CCC ప్రకారం డిడక్షన్ క్లెయిమ్ చేసుకుంటే, దీని నుంచి చేసే విత్‌డ్రాలు అన్నీ ట్యాక్స్ పరిధిలోకి రావాలి. పెన్షన్ ఫండ్‌కు కాంట్రిబూషన్ మాత్రమే చేసి డిడక్షన్స్‌ను క్లెయిమ్ చేసుకోని వారిని ఇది నష్టాలను కలిగిస్తోంది. అందువల్ల ఈ సెక్షన్‌లో మార్పులు చేయాలని ఐసీఏఐ చెబుతోంది. ఈ విభాగం కింద డిడక్షన్ క్లెయిమ్ చేసుకోనప్పుడు పెట్టుబడిలోని అప్రిసియేషన్ కాంపొనెంట్ (appreciation component) మాత్రమే ట్యాక్స్ పరిధిలోకి రావాలి.

డిడక్షన్స్ క్లెయిమ్ చేసినప్పటికీ, పథకం నుంచి ఉపసంహరించుకునే సమయంలో... మెచూరిటీ మొత్తాన్ని కాకుండా క్లెయిమ్ చేసుకున్న డిడక్షన్ మొత్తాన్ని మాత్రమే ఆదాయంగా పరిగణించాలి. పెట్టుబడి పెట్టిన ప్రిన్సిపల్‌ అమౌంట్‌పై ఏదైనా అప్రిసియేషన్ ఉంటే, దాన్ని క్యాపిటల్ గెయిన్‌గా పరిగణించి ట్యాక్స్‌ విధించవచ్చని ఐసీఏఐ తెలిపింది.

సెక్షన్ 80C లిమిట్‌ను రూ.2.5 లక్షలకు పెంచాలి
ప్రజలకు పొదుపు అవకాశాలను ఎక్కువగా కల్పించడానికి సెక్షన్ 80C కింద ప్రస్తుతం ఉన్న డిడక్షన్స్‌ లిమిట్‌ను రూ.1,50,000 నుంచి రూ.2,50,000కు పెంచాలని ICAI తెలిపింది.
Published by:Nikhil Kumar S
First published: