ఇంటలిజెన్స్ చీఫ్, 'రా' చీఫ్‌ల పదవీకాలం పొడగింపు..

సార్వత్రిక ఎన్నికల ముంగిట ఈ కీలక పదవుల్లో వారినే కొనసాగించాలన్న ఉద్దేశంతో కేంద్రంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఇద్దరి పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: December 15, 2018, 8:35 AM IST
ఇంటలిజెన్స్ చీఫ్, 'రా' చీఫ్‌ల పదవీకాలం పొడగింపు..
రాజీవ్ జైన్, అనిల్ కె ధస్మానా(Image: Youtube)
  • Share this:
దేశ ఇంటలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్ రాజీవ్ జైన్, భారత గూఢచర్య సంస్థ(రా) చీఫ్‌ అనిల్ కె ధస్మానాల పదవీ కాలాన్ని కేంద్రం పొడగించింది. ఇద్దరి పదవీ కాలాన్నిమరో ఆరు నెలల పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి ఐబీ డైరెక్టర్ రాజీవ్ జైన్ పదవీకాలం ఈ డిసెంబర్ 30న, 'రా' చీఫ్ అనిల్ కె ధస్మానా పదవీ కాలం డిసెంబర్ 29న ముగియనుంది. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఈ కీలక పదవుల్లో వారినే కొనసాగించాలన్న ఉద్దేశంతో కేంద్రంలోని కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఇద్దరి పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది.


కాగా, జార్ఖండ్‌కు చెందిన రాజీవ్ జైన్‌ 1980 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. 2016 డిసెంబరు 30న ఆయన ఐబీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ డిసెంబర్ 30తో ఆయన రెండేళ్ల పదవీకాలం ముగియనుంది. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా గతంలో ఆయన పోలీస్ మెడల్ కూడా అందుకున్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వానికి కశ్మీర్ వేర్పాటువాదంపై సలహాదారుడిగా కూడా పనిచేశారు.ఇక 'రా' చీఫ్ అనిల్ కె ధస్మానా మధ్యప్రదేశ్‌కు చెందిన 1981 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. డిసెంబర్ 29, 2016లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 29న ఆయన రెండేళ్ల పదవీకాలం ముగియనుంది. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్పులు చేయడం కంటే వారినే ఆ స్థానాల్లో కొనసాగించాలన్న ఉద్దేశంతో కేంద్రం వారి పదవులను మరో ఆరు నెలలు పొడగించింది.
Published by: Srinivas Mittapalli
First published: December 15, 2018, 8:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading