ఆ బొకే ఇచ్చినందుకు రూ.5000 ఫైన్ వేసిన IAS ఆఫీసర్...

IAS officer : సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని కేంద్రం పిలుపిచ్చింది. దీన్ని కచ్చితంగా పాటిస్తున్న ఆ కమిషనర్... రూ.5వేలు ఫైన్ వెయ్యడం కలకలం రేపింది.

news18-telugu
Updated: December 10, 2019, 9:53 AM IST
ఆ బొకే ఇచ్చినందుకు రూ.5000 ఫైన్ వేసిన IAS ఆఫీసర్...
ఆ బొకే ఇచ్చినందుకు రూ.5000 ఫైన్ వేసిన IAS ఆఫీసర్...
  • Share this:
Aurangabad : అది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సిటీ. పౌర విభాగం అధికారి రామచంద్ర మహాజన్... సోమవారం ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు బొకేతో వెళ్లాడు. చక్కగా కలిసి... నవ్వుతూ బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు. ఆ సమయంలో మహాజన్‌తో పాటూ చాలా మంది కొలీగ్స్ ఉన్నారు. పూల బొకే తీసుకున్న కమిషనర్ అస్తిక్ కుమార్ పాండే... వెంటనే... దాన్నికి ప్లాస్టిక్ రేపర్ చుట్టివుండటం చూశాడు. వెంటనే మహాజన్‌ను అక్కడే ఉంచి... సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్లను పిలిపించాడు. ప్లాస్టిక్ రేపర్ ఉన్న బొకే తెచ్చి ఇచ్చినందుకు మహాజన్‌కు రూ.5వేల ఫైన్ వెయ్యమని ఆదేశించాడు. స్పాట్‌లో వాళ్లు ఫైన్ వేసి... రిసీట్ మహాజన్ చేతిలో పెట్టారు. షాకవ్వడం అతని వంతైంది. ఆ ఫైన్ రిసీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీనిపై మీడియా అడుగుతున్న రకరకాల ప్రశ్నలకు కమిషనర్ పాండే సమాధానం ఇవ్వట్లేదు.

telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్,
ఫైన్ వేసిన IAS అధికారి అస్తిక్ కుమార్ (credit - FB - Astik Kumar)


ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు... సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ప్రభుత్వ ఆఫీసుల్లో నిషేదిద్దామని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. దాంతో దేశవ్యాప్తంగా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రూల్ అమలవుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం గతేడాది జూన్‌లో ప్లాస్టిక్ ఉత్పత్తులు, డిస్పోజబుల్ ఐటెమ్స్‌పై నిషేధం విధించింది. అప్పటి నుంచీ అలాంటి వాటిపై ఫైన్ వేస్తున్నారు.


Pics : క్రియేటివిటీని చాటుకుంటున్న మధులికా జోషీ
ఇవి కూడా చదవండి :భర్తను చంపేందుకు భార్య స్కెచ్... ఆ తర్వాత...పౌరసత్వ బిల్లుకు లోక్‌సభ ఆమోదం...

మిస్ యూనివర్స్‌ 2019... సౌతాఫ్రికా బ్యూటీ జొజిబినీ టున్జీ

పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?

Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి
Published by: Krishna Kumar N
First published: December 10, 2019, 9:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading