హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

IAF Rescues: 200 అడుగుల లోయ‌లో చిక్కుకున్న యువ‌కుడు.. కాపాడ్డానికి ఎయిర్ ఫోర్స్‌!

IAF Rescues: 200 అడుగుల లోయ‌లో చిక్కుకున్న యువ‌కుడు.. కాపాడ్డానికి ఎయిర్ ఫోర్స్‌!

యువ‌కుడిని కాపాడుతున్న ఎయిర్ ఫోర్స్ బృందం

యువ‌కుడిని కాపాడుతున్న ఎయిర్ ఫోర్స్ బృందం

IAF Rescues | బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది కొండ వద్ద కనీసం 200 అడుగుల లోయలో పడిపోయిన ట్రెక్కర్‌ను ఆదివారం భారత వైమానిక దళం (IAF), జాతీయ మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు రక్షించాయి. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్‌లో ఏఎన్ఐ వెల్ల‌డించింది.

ఇంకా చదవండి ...

  బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నంది కొండ వద్ద కనీసం 200 అడుగుల లోయలో పడిపోయిన ట్రెక్కర్‌ను ఆదివారం భారత వైమానిక దళం (Indian Air Force) , జాతీయ మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు రక్షించాయి. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్‌ (Twitter) లో ఏఎన్ఐ వెల్ల‌డించింది. బెంగళూరు (Bangalore) లోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల బాధితురాలు వాగులో పడి చిక్కుకుందని చిక్కబళ్లాపుర పోలీసు సూపరింటెండెంట్ జికె మిథున్ కుమార్ వెల్ల‌డించారు. “నిశాంక్ ట్రెక్కింగ్ కోసం ఒంటరిగా వచ్చి లోయలో పడిపోయాడు. జారిపడిన తరువాత, అతను లోయ‌ల ప‌డిపోకుండా ఓ ద‌గ్గ‌ర చిక్కుకున్నాడు. అతను అక్కడ నుంచి జారి ఉంటే, అతను దాదాపు 300 అడుగుల దిగువ కొండపై పడిపోయి ఉండేవాడ‌ని అధికారులు చెబుతున్నారు.

  Electric Vehicles: ఇక అన్ని.. ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌.. ప్ర‌భుత్వ సంచ‌లన నిర్ణ‌యం

  ఆ యువకుడు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు మెసేజ్ చేసి తన లొకేషన్‌ను పంచుకున్నాడు. వెంటనే, ఎస్‌డిఆర్‌ఎఫ్ మరియు ఎన్‌డిఆర్‌ఎఫ్‌తో పాటు పోలీసు బృందం రక్షించడానికి వెళ్ళింది, కానీ ఎవరూ సహాయం చేయలేకపోయారు.

  రంగంలోకి ర‌క్షణ శాఖ‌..

  దీనిపై వెంట‌నే IAFని అధికారులు సంప్రదించారు. ఐఏఎఫ్ ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా రక్షించటానికి రంగంలోకి దిగింది. ది హిల్స్‌లోని బ్రహ్మగిరి రాక్స్‌లో 200 అడుగుల దిగువన జారిపడి పడిపోయిన యువ ట్రెక్కర్ గురించి 'సేవ్ అవర్ సోల్స్' (SOS) సందేశంతో చిక్కబల్లాపుర డిప్యూటీ కమీషనర్ యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను సంప్రదించినట్లు రక్షణ నుంచి ఒక ప్రకటన వెలువ‌డింది.

  Regional Alliance: బీజేపీని నిలువ‌రించగ‌ల‌రా.. ప్రాంతీయ కుట‌మి బ‌లం, బ‌ల‌హీన‌త ఏమిటీ?

  ఎలా కాపాడారు..

  యువ‌కుడి కాపాడ‌డానికి ర‌క్ష‌ణ శాఖ ఎంఐ17 హెలికాప్టర్‌ను పంపించింది. స్థానిక పోలీసుల స‌హ‌కారంతో బాధితుడిని గుర్తించింది. అత‌ను ఎటు క‌ద‌ల‌ల లేని ప‌రిస్థితి ఉందిన గుర్తించి.. IAF వెంట‌నే Mi17 ఫ్లైట్ గన్నర్ ట్రెక్కర్‌కు దగ్గరగా పంపి కాపాడింది.

  ఈ ప్ర‌క్రియ‌లో ఇరుక్కుపోయిన ట్రెక్క‌ర్‌ను ఫ్లైట్ గన్నర్ అతనికి సహాయం చేసి పైకి లేపాడు. ఆన్‌బోర్డ్ ఎయిర్ ఫోర్స్ మెడికల్ అసిస్టెంట్ ప్రాణాలతో బయటపడగా, హెలికాప్టర్ అతన్ని యలహంకకు తరలించి అక్కడి నుండి సమీప సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ప్రకటన తెలిపింది. సాధారణంగా వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా బెంగళూరు నుంచి వారాంతాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్తారని పోలీసులు చెబుతున్నారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Bangalore, Indian Air Force

  ఉత్తమ కథలు