అభినందన్‌కు అరుదైన గౌరవం... వీర్ చక్ర అవార్డుకు నామినేట్ చేసిన వాయుసేన

శతృదేశం పాకిస్థాన్‌ చేతికి చిక్కి కూడా ఏమాత్రం చెక్కు చెదరని ఆత్మ విశ్వాసాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శించాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. తన ధైర్య సాహసాలతో తిరిగి సొంతగడ్డపై క్షేమంగా కాలు మోపి రియల్ హీరో అనిపించుకున్నారు.

news18-telugu
Updated: April 21, 2019, 10:07 AM IST
అభినందన్‌కు అరుదైన గౌరవం... వీర్ చక్ర అవార్డుకు నామినేట్ చేసిన వాయుసేన
అభినందన్ వర్ధమాన్
news18-telugu
Updated: April 21, 2019, 10:07 AM IST
భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్... ప్రస్తుతం ఈ పేరుకు పరిచయం కూడా అవసరం లేదు. అభినందన్ పేరు విన్నా చెప్పినా... భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి నరనరాల్లో దేశభక్తి ఉప్పుంగొతుంది. భారతీయుల హృదయాలు ధీరత్వంతో నిండిపోతాయి. అభినందన్ అనే పేరు భారత్ కు ఓ బ్రాండ్‌గా మారిపోయింది. శతృదేశం పాకిస్థాన్‌ చేతికి చిక్కి కూడా ఏమాత్రం చెక్కు చెదరని ఆత్మ విశ్వాసాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శించాడు వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్. తన ధైర్య సాహసాలతో తిరిగి సొంతగడ్డపై క్షేమంగా కాలు మోపి రియల్ హీరో అనిపించుకున్నారు. అలాంటి అభినందన్‌ వీరత్వం గుర్తించి ఆయనకు భారత అత్యున్నత అవార్డైన వీర చక్ర ఇవ్వాలని కోరుతూ భారత వాయుసేన నామినేట్ చేసింది. అభినందన్ కనబర్చిన ధైర్య సాహసాలకు వీర్ చక్ర అవార్డు సరైనదని వాయుసేన వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.

వీర్ చక్ర పురస్కారం.. భారతదేశంలో పరమవీర చక్ర,మహావీర చక్ర అవార్డుల తర్వాత మూడో అత్యున్నత అవార్డు. అంతకుముందు తమిళనాడు సీఎం పళనిస్వామి అభినందన్‌కు పరమవీర చక్ర ఇవ్వాలని ప్రధానికి మోదీకి లేఖ రాశారు. అభినందన్ సొంత రాష్ట్రం తమిళనాడు. 1983 జూన్ 21న భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్థమాన్ కు జన్మించాడు. అభినందన్ తల్లి డాక్టర్, తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో యుద్ధ విమానాల పైలట్‌గా పనిచేశాడు. ప్రస్తుతం చెన్నైలో అభినందన్ కుటుంబం నివాసముంటుంది.

2019 ఫిబ్రవరి 27న పాకిస్తానీ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తన మిగ్-21 నడుపుతూ వెంబడించి కూల్చేశాడు. అయితే ఈ వైమానిక పోరాటంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 పాకిస్తానీ భూభాగంలోకి వెళ్ళింది, పాకిస్తానీ వైమానిక దళం వారు దీన్ని కూల్చివేశారు. ఈ ఘటనలో అభినందన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి వెళ్లి పాక్ ఆర్మీకి చిక్కాడు.అయితే ఇప్పటివరకు భారత ప్రభుత్వం 21మందికి మాత్రమే పరమ్ వీర్ చక్ర అవార్డులను ప్రకటించింది. ఇందులో 20మంది ఇండియన్ ఆర్మీకి చెందిన వారైతే.. ఒకరు మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF)కు చెందినవారు కావడం విశేషం. భారత్ ఫాక్ యుద్ధ సమయంలో 1971 డిసెంబర్ 14న IAF ఫ్లయింగ్ ఆఫీస్ నిర్మల్ జిత్ జింగ్ సిఖోన్‌‌కు పరమ్ వీర్ చక్ర అవార్డు దక్కింది.First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...