హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

చైనా,పాక్ కు దబిడిదిబిడే..రూ.1.5 లక్షల కోట్లతో 114 ఆధునిక యుద్ధ విమానాల కొనుగోలు

చైనా,పాక్ కు దబిడిదిబిడే..రూ.1.5 లక్షల కోట్లతో 114 ఆధునిక యుద్ధ విమానాల కొనుగోలు

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

IAF Plans For 114 Combat Aircraft: సరిహద్దు దేశాల నుంచి ముప్పు పొంచి నేపథ్యంలో సైనిక, ఆయుధ శక్తిని పటిష్ఠపర్చుకునే దిశగా భారత్‌(India) వడివడిగా అడుగులు వేస్తోంది. కొత్తగా 114 ఫైటర్​ జెట్స్(Fighter Jets)​ కొనుగోలుకు భారత వాయుసేన(Indian Airforce) ప్రణాళికలు రచిస్తోంది. అయితే వీటిల్లో 96 విమానాలు మేడ్​ ఇన్​ ఇండియాలో భాగంగా భారత్ లోనే తయారుకానున్నాయి.

ఇంకా చదవండి ...

IAF Plans For 114 Combat Aircraft: సరిహద్దు దేశాల నుంచి ముప్పు పొంచి నేపథ్యంలో సైనిక, ఆయుధ శక్తిని పటిష్ఠపర్చుకునే దిశగా భారత్‌(India) వడివడిగా అడుగులు వేస్తోంది. కొత్తగా 114 ఫైటర్​ జెట్స్(Fighter Jets)​ కొనుగోలుకు భారత వాయుసేన(Indian Airforce) ప్రణాళికలు రచిస్తోంది. అయితే వీటిల్లో 96 విమానాలు మేడ్​ ఇన్​ ఇండియాలో భాగంగా భారత్ లోనే తయారుకానున్నాయి. ఫలితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్​ భారత్​వైపు దేశం మరో అడుగు వేసినట్లు అయింది. కేవలం 18 యుద్ధ విమానాలను మాత్రమే విదేశాల నుంచి భారత్‌ దిగుమతి చేసుకోనున్నారు. "బై గ్లోబల్​ అండ్​ మేక్​ ఇన్​ ఇండియా(Buy Global And Make In India)" పథకంలో భాగంగా మొత్తం 114 MRFA(మల్టీరోల్​ ఫైటర్​ ఎయిర్​క్రాఫ్ట్​)లు కొనేందుకు చూస్తోంది వాయుసేన. ఈ పథకంలో భాగంగా.. విదేశీ విక్రయదారులతో భారత సంస్థలు భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవచ్చు.​ ఈ మేరకు విదేశీ సంస్థలతో భాగస్వామ్యం అయ్యేందుకు భారత కంపెనీలకు అవకాశం కల్పిస్తారు.

ఇటీవల భారత వైమానిక దళం.. విదేశీ యుద్ధ విమాన తయారీ సంస్థలతో సమావేశం నిర్వహించింది. మేకిన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగస్వామ్యం అవడంపై ఇందులో వారు చర్చించారు. ప్రణాళికలో భాగంగా తొలుత 18 యుద్ధ విమానాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. తదుపరి 36 యుద్ధ విమానాలను భారత్‌లోనే తయారు చేస్తారు. వీటికి విదేశీ కరెన్సీ, భారత కరెన్సీలలో చెల్లింపులు ఉంటాయి. ఇక 60 యుద్ధ విమానాల బాధ్యత పూర్తిగా భారత కంపెనీలదే. చెల్లింపులు కూడా కేవలం భారత కరెన్సీలోనే ఉంటాయి. ఈ ప్రక్రియ కోసం టెండర్​ను నిర్వహించనున్నట్టు సమాచారం. ప్రముఖ ఎయిర్​క్రాఫ్ట్​ తయారీ సంస్థలు బోయింగ్​, లాక్​హీడ్​ మార్టిన్​, సాబ్​, ఇర్కుట్.. ఈ ​టెండర్​లో పాల్గొంటాయని తెలుస్తోంది.

బండారం ముందే బయటపడింది..మరికొన్ని క్షణాల్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు చేసిన పనికి అందరూ షాక్!

పాకిస్తాన్​, చైనా దేశాల నుంచి నిత్యం ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్న వేళ ఈ 114 ఫైటర్​ జెట్స్​ భారత వాయుసేనకు మరింత బలాన్ని చేకూర్చుతాయి.శత్రువులను భయపెట్టేందుకు ఇప్పటికే రఫేల్​ యుద్ధ విమానాలను తన ఖాతాలో వేసుకుంది భారత వాయుసేన. రఫేల్​తో పాటు మరికొన్ని అత్యాధునిక ఆయుధాల కొనుగోళ్లకు ఆర్డర్లు ఇచ్చింది. ఇక,పాతవిగా మారిన మిగ్‌ సిరీస్‌ యుద్ధ విమానాలను కొత్త వాటితో భర్తీ చేయాలని భారత వైమానిక దళం కోరుకుంటోంది. ఐదో తరం అడ్వాన్స్డ్‌ మీడియం యుద్ధ విమానాల ప్రాజెక్టు సంతృప్తికర స్థాయిలో ముందుకు సాగుతోంది. అయితే అవి మన చేతికి అందేసరికి చాలా సమయం పడుతుంది. నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండి, ఎక్కువ సామర్థ్యం ఉన్న యుద్ధ విమానాల కోసం భారత్ చూస్తోంది.

See pics : సముద్రంలో బంగారు ఓడ..కుప్పలు కుప్పలుగా బంగారం.. దేశం అప్పులు తీరిపోతాయ్.మరోవైపు, భారత వైమానిక దళం మరో రికార్డు సృష్టించింది. ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్‌ఫోర్స్‌లలో.. దేశాల వారీగా చూస్తే మూడో స్థానంలో, వైమానిక దళాల వారీగా చూస్తే ఆరో స్థానంలో నిలిచింది. మొత్తంగా చైనా కన్నా మన ఎయిర్‌ ఫోర్స్‌ పైన ఉండటం గమనార్హం. వరల్డ్‌ డైరెక్టరీ ఆఫ్‌ మోడర్న్‌ మిలటరీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ (డబ్ల్యూడీఎంఎంఏ) సంస్థ క్షుణ్నంగా అధ్యయనం చేసి ఈ ర్యాంకులను ఇచ్చింది. క్వాంటిటీ (సంఖ్య)తోపాటు క్వాలిటీ రెండింటి లోనూ అమెరికా దళాలు ప్రపంచంలోనే టాప్‌లో నిలిచాయి. తొలి రెండు స్థానాల్లో యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ (టీవీఆర్‌ 242.9), యూఎస్‌ నేవీ (142.4) నిలవగా.. రష్యన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (114.2) మూడో స్థానం సాధించింది. తిరిగి నాలుగు, ఐదో స్థానాల్లో యూఎస్‌ ఆర్మీ ఏవియేషన్‌ (112.6), యూఎస్‌ మెరైన్‌ కార్ప్స్‌ (85.3) నిలిచాయి. ఆరో స్థానంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ (69.4) నిలిచింది. ఇదే దేశాల వారీగా చూస్తే మన ఎయిర్‌ఫోర్స్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలవడం గమనార్హం. మన కన్నా ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఉన్న చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్‌ (63.8) ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే చైనా పీఎల్‌ఏ నేవీ ఎయిర్‌ఫోర్స్‌ (49.3) 15వ స్థానంలో నిలిచింది. మన ఇండియన్‌ నేవీ ఏవియేషన్‌ (41.2 స్కోర్‌) 28వ స్థానంలో, ఆర్మీ ఏవియేషన్‌ (30 స్కోర్‌) 36వ స్థానంలో ఉండిపోయాయి.

Published by:Venkaiah Naidu
First published:

Tags: AIRCRAFT, Indian Air Force

ఉత్తమ కథలు