అభినందన్ భద్రతకు ముప్పు..కాశ్మీర్‌కు దూరంగా పోస్టింగ్

జమ్మూకాశ్మీర్ నుంచి దూరంగా ఉంచినప్పటికీ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఎయిర్‌బేస్‌కే ఆయన్ను పంపించినట్లు సమాచారం.

news18-telugu
Updated: April 20, 2019, 7:51 PM IST
అభినందన్ భద్రతకు ముప్పు..కాశ్మీర్‌కు దూరంగా పోస్టింగ్
అభినందన్ వర్థమాన్ (PTI)
news18-telugu
Updated: April 20, 2019, 7:51 PM IST
పాకిస్తాన్‌‌లో భారతదేశం మీసం మెలేసిన వింగ్ కమాండర్ అభినందన్ భద్రతకు ముప్పుపొంచి ఉంది. ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్ అధికారులు శ్రీనగర్ ఎయిర్‌బేస్ నుంచి ఆయన్ను బదిలీ చేశారు. పశ్చిమ ప్రాంతంలోని ఓ ప్రముఖ ఎయిర్‌బేస్‌లో పోస్టింగ్ ఇచ్చారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన వెళ్లబోయే ఎయిర్‌బేస్ వివరాలను రహస్యంగా ఉంచారు. జమ్మూకాశ్మీర్ నుంచి దూరంగా ఉంచినప్పటికీ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఎయిర్‌బేస్‌కే ఆయన్ను పంపించినట్లు సమాచారం.

అభినందన్‌కు పోస్టింగ్ ఆర్డర్ జారీ అయింది. త్వరలో ఆయన శ్రీనగర్ ఎయిర్‌బేస్‌ నుంచి కొత్త ప్రాంతానికి వెళ్లిపోతారు. ఫ్లైయింగ్ టెస్ట్‌లు పూర్తైతే తిరిగి ఆయన ఫైటర్ జెట్స్‌ని నడుపుతారు.
ప్రభుత్వ వర్గాలు


ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులుచేసి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఆ మరుసటి రోజే భారత మిలటరీ స్థావరాలను పాకిస్తాన్ వాయుసేన టార్గెట్ చేయడంతో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అప్రమత్తమై తిప్పికొట్టింది. భారత్ వైపు దూసుకొచ్చిన పాకిస్తాన్ యుద్ధ విమానాల్లో F-16ని అభినందన్ తరిమికొట్టాడు. మిగ్-21 బైసన్ ఫైటర్ జెట్‌తో వెంబడించి ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాడు. ఆ క్రమంలో పాక్ విమానంతో పాటు అభినందన్ విమానం కూడా కుప్పకూలింది.

పారాచూట్ సాయంతో ప్రాణాలు కాపాడుకున్న అభినందన్..పీవోకేలోని ఓ గ్రామంలో దిగడంతో స్థానికులు చితకబాది పాక్ మిలటరీకి అప్పగించారు. భారత వాయుసేన రహస్యాలను కూపీలాగేందుకు పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నించినప్పటికీ..అభినందన్ ఏ వివరాలను బహిర్గతం చేయలేదు. ఐతే భారత్‌తో పాటు అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు రావడంతో ఎట్టకేలకు తలొగ్గిన పాకిస్తాన్...అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది. కాగా, F-16 జెట్‌ని కూల్చిన తొలి ఫైటర్ పైలట్ అభినందనే కావడం విశేషం.


First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...