హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

MiG-21 Planes: మిగ్ యుద్ధ విమానాలకు ఎయిర్‌ఫోర్స్ గుడ్‌బై.. ఈ ఏడాది నుంచే షురూ

MiG-21 Planes: మిగ్ యుద్ధ విమానాలకు ఎయిర్‌ఫోర్స్ గుడ్‌బై.. ఈ ఏడాది నుంచే షురూ

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Mig-21 Fighter Jet: 2019లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో.. పాక్ యుద్ధ విమానాలను తిరిమికొట్టడంలో.. 51 స్వార్డ్ ఆర్మ్స్ స్క్వాడ్రన్ కీలక పాత్ర పోషించింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాలను కూల్చారు.

ఇంకా చదవండి ...

  భారత వైమానిక దళంలోని మిగ్-21 యుద్ధ విమానాలు (MiG-21 Fighter Jets) తరచూ ప్రమాదాలు గురవుతున్నాయి. ఇప్పటికే  ఎంతో మంది పైలట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల రాజస్థాన్‌(Rajasthan)లోని బార్మేర్ జిల్లాలో మరో మిగ్ విమానం కూలిపోయింది. ఆ ఘటనలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వింగ్ కమాండర్ రానా, జమ్మూకు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ ఆదిత్య బల్‌ ప్రాణాలు కోల్పోయారు. తరచూ ప్రమాదాల బారిన పడుతున్న ఈ విమానాలను  తప్పించాలన్న డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాయుసేన కీలక విషయాలను వెల్లడించింది. వాటిని ఎయిర్ ఫోన్స్ నుంచి తప్పించే ప్రక్రియ.. ఈ ఏడాది నుంచే మొదలవుతోందని.. 2025 నాటికి.. మిగ్ విమానాలను పూర్తిగా ఉద్వాసన పలుకుతామని పేర్కొంది.

  India Covid Updates : వరుసగా మూడో రోజూ భారీగా.. కొత్తగా 20,408 వేల కేసులు, 54 మరణాలు..

  ప్రస్తుతం మన దేశం వద్ద నాలుగు స్క్వాడ్రాన్ల‌ మిగ్-21 విమానాలున్నాయి. ఒక్కో స్క్వాడ్రాన్‌లో 16 నుంచి 18 మిగ్ విమానాలుంటాయి.  శ్రీనగర్  (Srinagar) కేంద్రంగా పనిచేసే 51 స్వార్డ్ ఆర్మ్స్  స్క్వాడ్రాన్‌కు ఈ సెప్టెంబరులో వీడ్కోలు పలకనున్నట్లు వాయుసేన తెలిపింది. ఇక  రాజస్థాన్‌లోని  ఉత్తర్‌లాయి, సూరత్‌గఢ్, నాల్ కేంద్రంగా పనిచేసే మిగతా మూడు స్కాడ్రాన్క్‌లకు కూడా రాబోయే రోజుల్లో వీడ్కోలు పలకనున్నారు. మొత్తంగా 2025 నాటికి ఎయిర్‌ఫోర్స్ (Indian Airforce) నుంచి అన్ని మిగ్ యుద్ధ విమానాలకు ఉద్వాసన పలుకుతారు.

  తగ్గేదెలే.. యూపీ తరహా ఎన్ కౌంటర్లకు తాము సిద్ధమే.. మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు.. అసలేం జరిగిందంటే..

  2019లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో.. పాక్ యుద్ధ విమానాలను తిరిమికొట్టడంలో.. 51 స్వార్డ్ ఆర్మ్స్ స్క్వాడ్రన్ కీలక పాత్ర పోషించింది. వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 విమానాలను కూల్చారు. ఈ మిగ్ యుద్ధ విమానంతోనే పాక్ సైన్యాన్ని తరిమికొట్టారు అభినందన్ వర్తమాన్. అనంతరం పాకిస్తాన్ భూభాగంలో దిగి.. ఆ దేశ ప్రజలకు చిక్కాడు. ఆ తర్వాత భారత ప్రభుత్వ చొరవతో క్షేమంగా ఇండియాకు తిరిగొచ్చారు. ఆయన ధైర్యసాహసాలకు గాను కేంద్ర ప్రభుత్వం వీరచక్ర పురస్కారంతో సత్కరించింది.

  కాగా, MiG-21... ఫ్లయింగ్ కాఫిన్ , విడో మేకర్ అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే ఈ ఫ్లైట్‌లో ప్రయాణిస్తే తిరిగిరారనే అపవాదును మూటగట్టుకుంది.  MiG-2బైసన్ ఈ సిరీస్‌లో సరికొత్త వేరియంట్. అప్‌గ్రేడ్ చేసినప్పటికీ.. తరచూ ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. గత 60 ఏళ్లలో ఏకంగా 400 మిగ్-21 యుద్ధ విమానాలు కూలిపోయాయి.ఈ ప్రమాదాల్లో 200 మందికి పైగా పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. 50 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

  1964లో MiG-12 యుద్ధ విమానం మొదటి సూపర్‌సోనిక్ ఫైటర్ జెట్‌గా భారత వైమానిక దళంలోకి చేరింది. ప్రారంభంలో ఈ జెట్‌లను రష్యాలో తయారు చేశారు. వీటిని అసెంబుల్ చేసే హక్కులతో పాటు సాంకేతికను కూడా భారత్ పొందింది. ఆ తర్వాత 1967లో ఈ విమానాల తయారీకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లైసెన్స్ పొందింది. అనంతరం విమానాల ఉత్పత్తిని ప్రారంభించింది. రష్యా 1985లో మిగ్ విమానాల తయారీని నిలిపివేసింది. ఐతే భారత వాయుసేన మాత్రం దానిని అప్‌గ్రేడ్ వేరియంట్‌ను ఉపయోగిస్తోంది. పాకిస్తాన్‌తో 1971, 1999 కార్గిల్ యుద్ధ సమయంలో కూడా MiG-21 విమానాలు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం వాయుసేనలోకి తేజస్, రాఫెల్ వంటి అత్యాధునిక, శక్తివంతమైన యుద్ధ విమానాలు వస్తున్నాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Indian Air Force, MiG-21 Fighter Jets

  ఉత్తమ కథలు