హోమ్ /వార్తలు /జాతీయం /

కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలో రాఫెల్ నమూనా

కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలో రాఫెల్ నమూనా

రాఫెల్ జెట్ నమూనా

రాఫెల్ జెట్ నమూనా

కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలో కొత్తగా రాఫెల్ జెట్ నమూనాను ఏర్పాటు చేయడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

దేశ రాజధానిలోని భారత వైమానిక దళ ఎయిర్ చీఫ్ మార్షల్ ఇంటి ఎదుట రాఫెల్ జెట్ నమూనాను ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారుతోంది. ఢిల్లీ అక్బర్ రోడ్డులోని ఎయిర్‌ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవ ఇంటికి ఎదురే కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ ఉండడమే దీనికి కారణం. గతంలో ఇక్కడ సుఖోయ్ ఎస్‌యూ-30 నమూనా ఉండేది. మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తరుణంలో.. ఇప్పుడు అక్కడ రాఫెల్ జెట్ నమూనా ఏర్పాటు చేశారు. యాధృశ్చికంగా జరిగిందో? కావాలనే చేశారో? తెలీదుకానీ..ఇప్పుడు ఈ అంశం ఢిల్లీ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాఫెల్ స్కాంను ప్రస్తావిస్తూ మోడీ సర్కారును కాంగ్రెస్ నేతలు టార్గెట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ రాఫెల్ డీల్ అంశాన్ని లేవనెత్తుతూ మోడీ సర్కారుపై ఆరోపణలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి కేంద్రంలో మళ్లీ అధికార పగ్గాలు కైవసం చేసుకుంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్‌కు కూతవేటు దూరంలోనే రాఫెల్ జెట్ నమూనాను ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మరి ప్రధాని మోదీపై రాఫెల్ స్కాం ఆరోపణలను రాహుల్ గాంధీ ఇక మానుకుంటారో? కొనసాగిస్తారో? తెలియాల్సి ఉంది.

First published:

Tags: Congress, Indian Air Force, Rafale Deal

ఉత్తమ కథలు