హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఆ సంగతి మాకు తెలియదు.. టార్గెట్ ఫినిష్ చేశామా అన్నదే మా లెక్క : ఎయిర్‌ఫోర్స్ చీఫ్

ఆ సంగతి మాకు తెలియదు.. టార్గెట్ ఫినిష్ చేశామా అన్నదే మా లెక్క : ఎయిర్‌ఫోర్స్ చీఫ్

కశ్మీర్ పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌ జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 300 పైచిలుకు ఉగ్రవాదులు చనిపోయారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే అధికారికంగా ప్రభుత్వం గానీ, సైన్యం గానీ దీనిపై ఎటువంటి లెక్కలు విడుదల చేయలేదు.

ఇంకా చదవండి ...

  పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత వైమానిక దాడిలో ఎంతమంతి చనిపోయారో తాము లెక్కించలేదని భారత ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా అన్నారు. ప్రాణ నష్టంపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. లక్ష్యాన్ని తాము పేల్చేశామా లేదా అన్నదే తమ లెక్క అని.. ప్రాణ నష్టం గురించి తాము మాట్లాడలేమని అన్నారు. దానిపై ప్రభుత్వమే స్పష్టత ఇస్తుందన్నారు. సోమవారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

  వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ యుద్ద విమానం నడపడానికి సిద్దంగా ఉన్నారో లేదో వైద్య పరీక్షల్లో తేలుతుందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు అవసరమైన శస్త్ర చికిత్సలు అందిస్తున్నారని చెప్పారు. వైద్యులు అభినందన్ ఫిట్‌గా ఉన్నారని ధ్రువీకరిస్తే.. త్వరలోనే యుద్ద విమానం కాక్‌పిట్‌(విమాన కేబిన్)లోకి వస్తారని చెప్పారు.

  కాగా, కశ్మీర్ పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్‌లోని బాలాకోట్‌ జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 300 పైచిలుకు ఉగ్రవాదులు చనిపోయారన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే అధికారికంగా ప్రభుత్వం గానీ, సైన్యం గానీ దీనిపై ఎటువంటి లెక్కలు విడుదల చేయలేదు. ఇలాంటి తరుణంలో కేంద్రమంత్రి అహుల్‌వాల్యా సైతం ప్రాణ నష్టం చేయాలన్న ఉద్దేశంతో తాము దాడులకు పాల్పడలేదని.. పాకిస్తాన్‌కు భారత్ సత్తా ఏంటో చూపించడానికే దాడులు చేశామని అన్నారు.తాజాగా ఎయిర్‌ఫోర్స్ చీఫ్ కూడా ప్రాణ నష్టంపై తాము స్పందించలేమని చెప్పడం గమనార్హం. దీంతో బాలాకోట్ ఉగ్రదాడిలో అసలెంతమంది చనిపోయారన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది.

  ఇది కూడా చదవండి : చంపడం మా ఉద్దేశం కాదు..: బాలాకోట్ దాడిపై కేంద్రమంత్రి

  First published:

  Tags: Imran khan, Indian Air Force, Jammu and Kashmir, Kashmir security, Narendra modi, Pulwama Terror Attack

  ఉత్తమ కథలు