మి‌‌డతలకు చెక్... ప్రత్యేక చాపర్లను సిద్ధం చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్...

చివరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వయంగా చాపర్లను రంగంలోకి దింపుతోందంటే... ఉత్తరాది రాష్ట్రాల్లో మిడతల సమస్య ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

news18-telugu
Updated: July 1, 2020, 10:42 AM IST
మి‌‌డతలకు చెక్... ప్రత్యేక చాపర్లను సిద్ధం చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్...
మి‌‌డతలకు చెక్... ప్రత్యేక చాపర్లను సిద్ధం చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్... (File)
  • Share this:
మన దేశాన్ని పట్టి పీడించే వాటిలో తాజాగా చేరినవే మిడతలు. ఎక్కడో తూర్పు ఆఫ్రికాలో... నిలువుగా పెరిగిన గడ్డి తినీ తినీ బోరుకొట్టి... ఇండియావైపు వచ్చిన మిడతలు... ఈసారి భారీ సంఖ్యలో దండెత్తాయి. వీటిని వదిలించుకునేందుకు చాలా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం డ్రోన్లను రంగంలోకి దింపుతూ... కొంతవరకూ కంట్రోల్ చేస్తున్నాయి. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్... Mi-17 చాపర్లతో... మందులు చల్లేందుకు వీలుగా... ఓ పరికరాన్ని తయారుచేసింది. దీని పేరు ఎయిర్‌బోర్న్ లోకస్ట్ కంట్రోల్ సిస్టం (ALCS)... దీని ద్వారా... హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ... మిడతలపై పురుగు మందులు చల్లవచ్చు. తద్వారా వాడి బెడద వదిలించాలని ఎయిర్ ఫోర్స్ డిసైడైంది.

ఛండీగఢ్‌లోని ఎయిర్ ఫోర్స్ రిపేర్ డిపో... దీన్ని తయారుచేసింది. నిజానికి మిడతల సమస్య ఏటా ఉండేదే. ఈసారే భారీగా వచ్చాయి. 2020 మేలో.... కేంద్ర వ్యవసాయ శాఖ... బ్రిటన్ కంపెనీతో ఓ డీల్ కుదుర్చుకుంది. దాని ప్రకారం... రెండు Mi-17 చాపర్లను... మిడతలపై పురుగుమందులు చల్లేందుకు వీలుగా ఉండేలా మార్పులు చెయ్యమని కోరింది. ఐతే... ఆ కంపెనీ... మార్పులు చెయ్యడానికి సెప్టెంబర్ వరకూ టైమ్ పడుతుందని చెప్పింది. కారణం కరోనా అని తేల్చింది. అప్పటి వరకు మిడతలు ఆగవు కదా... ఈలోపే పంటల్ని తినేస్తాయి. అందుకే ఇండియన్ ఎయిర్‌ ఫోర్సే స్వయంగా కిట్ తయారుచేసింది.

Locusts swarms dead, drones to spray insecticides against swarms of locusts, మిడతల దండుపై డ్రోన్లతో దాడి, కెమికల్స్‌తో మిడతలపై దాడి
ప్రతీకాత్మక చిత్రం


ఈ కొత్త కిట్‌లో ఉన్న ట్యాంకులో 800 లీటర్ల... మలాథియన్ అనే పురుగుమందును నింపవచ్చు. దాన్ని ఎలక్ట్రిక పంపు వాడి... ప్రత్యేక కన్నాల ద్వారా... గాలిలోకి వదలవచ్చు. తద్వారా... 750 హెక్టార్ల వ్యవసాయ భూమిపై... జస్ట్ 40 నిమిషాల్లో ఈ మందును చల్లవచ్చు. ఇలా... పురుగు మందు నింపిన ప్రతిసారీ... 750 హెక్టార్లు కవర్ అవుతాయి. తద్వారా వేగంగా మిడతల అంతు చూడవచ్చు.

బెంగళూరులో ఈ కిట్‌ని ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మిడతల కోసం తయారుచేసిన ఈ కొత్త కిట్... ఇకపైనా మన దేశంలో ఎన్నో రకాల పురుగుల్ని అంతం చేసేందుకు ఉపయోగపడనుంది. దీన్ని దేశీయంగా చేయడం వల్ల ఇండియాకి చాలా ఖర్చు కలిసొచ్చింది. ఆత్మనిర్భర భారత్‌కి ఇది మచ్చుతునకగా మారింది.
First published: July 1, 2020, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading