బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలు దేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానం ఏఎన్ -32 ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయంలోని రన్‌వే నంబరు 27పై ఇష్టారాజ్యంగా దూసుకొచ్చింది.
ముంబై ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం తప్పింది. రన్‌వే పైకి ఇష్టారాజ్యంగా దూసుకొచ్చిన ఓ విమానం ప్రయాణికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కొంచెం అయితే ఊహించని రీతిలో ప్రమాదం జరిగి ఉండేది. అసలేం జరిగిందంటే.. బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలు దేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన విమానం ఏఎన్ -32 ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయంలోని రన్‌వే నంబరు 27పై ఇష్టారాజ్యంగా దూసుకొచ్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి 11:39కి చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే 50 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబై నుంచి వెళ్లాల్సిన విమానాలు అరగంట ఆలస్యంగా బయలుదేరాయి. భారత వైమానిక దళానికి చెందిన విమానం ఇలా దూసుకురావడం ఒకింత ఆందోళనకు గురి చేసింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.