దేశ ప్రధాని ఎప్పుడవుతారన్న ప్రశ్నకు స్మృతి ఇరానీ సమాధానం ఇదీ..

Smriti Irani Interesting Comments | అప్పుడప్పుడూ తమ కామెంట్లతో సెన్సేషన్ సృష్టించే కేంద్ర మంత్రుల్లో స్మృతీ ఇరానీ ఒకరు. తాజాగా ఆమె మీరు ఎప్పుడు దేశ ప్రధాని అవుతారన్న ప్రశ్నకు ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

Krishna Kumar N | news18-telugu
Updated: February 4, 2019, 10:59 AM IST
దేశ ప్రధాని ఎప్పుడవుతారన్న ప్రశ్నకు స్మృతి ఇరానీ సమాధానం ఇదీ..
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Photo:ANI)
  • Share this:
మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. ఆ సందర్భంగా ఓ వ్యక్తి... మిమ్మల్ని ప్రధానిగా ఎప్పుడు చూడగలం అని ప్రశ్నించాడు. వెంటనే ఆమె ఎప్పటికీ చూడలేరు అని సమాధానం ఇచ్చారు. ఎందుకూ అంటే... ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల నుంచి తప్పుకున్న వెంటనే, తాను కూడా రాజకీయాలకు గుడ్‌బై చెబుతానన్నారు స్మృతీ ఇరానీ. అందువల్ల తాను ఎప్పటికీ ప్రధానిని కాలేనని అన్నారు. పైగా... మోదీ ఇంకా చాలా కాలం రాజకీయాల్లో ఉంటారనీ, అందువల్ల తాను కూడా ఎక్కువ కాలమే పాలిటిక్స్‌లో ఉంటానని అన్నారు. అంతేకాదు... అత్యంత ఎక్కువ ప్రజాదరణ ఉన్న మాజీ ప్రధాని వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని మోదీ అధ్వర్యంలో పనిచెయ్యడం తనకెంతో నచ్చిందన్నారు స్మృతీ ఇరానీ.

smriti irani, smriti irani speech, union minister smriti irani, smriti irani yoga, smriti irani pics, smriti irani live, smriti irani news, స్మృతీ ఇరానీ, నరేంద్ర మోదీ, అమేథీ నియోజకవర్గం
స్మృతీ ఇరానీ (Image : File)


ఇదంతా విన్న ఆ వ్యక్తి వెంటనే మరో ప్రశ్న వేశాడు. మోదీ తప్ప ఇంకొకరి అధ్వర్యంలో పనిచెయ్యడం ఇష్టం లేదా? అని. అలాంటిదేమీ లేదన్న ఆమె... ప్రస్తుతం తాను రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ లాంటి నేతల నాయకత్వంలో కూడా పనిచేస్తున్నానని వివరించారు. రాజకీయాల్లో 18 ఏళ్లుగా చాలా మంది నేతల్ని కలిశానన్న ఆమె... చాలా మంది దగ్గర పనిచేశానని తెలిపారు.

అవసరమైతే అమేథీ నుంచీ బరిలోకి : ప్రస్తుతం కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నుంచీ తాను బరిలో దిగడానికి సిద్ధమే అన్నారు స్మృతీ ఇరానీ. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని బట్టీ... తన స్టెప్ ఉంటుందన్నారు. మొత్తానికి స్మృతీ అన్న మాటల్ని ఎవరికి తోచినట్లు వాళ్లు విశ్లేషించుకుంటున్నారు.

 

Video: మంత్రి పరిటాల సునీత కాన్వాయ్‌పై చెప్పుల దాడి
First published: February 4, 2019, 10:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading