హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Modi@8: రాజకీయాల్లో మోదీ గురు మంత్రాన్ని అనుసరిస్తున్నాను: న్యూస్18తో యూపీ ఎంపీ వినోద్ సోంకర్..!

Modi@8: రాజకీయాల్లో మోదీ గురు మంత్రాన్ని అనుసరిస్తున్నాను: న్యూస్18తో యూపీ ఎంపీ వినోద్ సోంకర్..!

యూపీ ఎంపీ వినోద్ సోంకర్

యూపీ ఎంపీ వినోద్ సోంకర్

ఉత్తరప్రదేశ్‌ నుంచి 2014, 2019లో ఎంపీగా గెలిచిన వినోద్ సోంకర్ తన రాజకీయ అనుభవాన్ని న్యూస్18తో పంచుకున్నారు. ఆయన పార్టీ త్రిపుర ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురు మంత్రాన్ని అనుసరించి తాను రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినట్లు సోంకర్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేత మోదీయే అన్నారు.  

ఇంకా చదవండి ...

కేంద్రంలో బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు(Eight Years) గడిచాయి. 2014 తరువాత 219 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ విజయఢంకా మోగించింది. వరుసగా రెండోసారి మోదీ ప్రధాని(PM Modi ) పదవి చేపట్టారు. ఈ 8 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి నేతలు కృషి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌(Uttara Pradesh) నుంచి 2014, 2019లో ఎంపీగా గెలిచిన వినోద్ సోంకర్(Vinod Sonkar) తన రాజకీయ అనుభవాన్ని న్యూస్18తో(News18) పంచుకున్నారు. ఆయన పార్టీ త్రిపుర(Tripura) ఇన్‌ఛార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) గురు మంత్రాన్ని అనుసరించి తాను రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినట్లు సోంకర్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేత మోదీయే అన్నారు.

తాను 2014లో ఎంపీగా గెలిచినప్పుడు హర్యానాలో ఓ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగిందని వినోద్ సోంకర్ తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక నాయకుడిగా మన గుర్తింపుపై దృష్టి పెట్టాలని ప్రధాని చెప్పారని ఆయన అన్నారు. రాజకీయ గుర్తింపు తాత్కాలికమని, సామాజిక గుర్తింపు శాశ్వతమన్న విషయాన్ని నేతలు గుర్తించాలని మోదీ పేర్కొన్నట్లు తెలిపారు. మోదీ వ్యాఖ్యలను అనుసరించి కౌశాంబి వికాస్ పరిషత్ (కెవీపీ)ని ఏర్పాటు చేసినట్లు వినోద్ సోంకర్ పేర్కొన్నారు. ప్రతి ఏడాది దీని ద్వారా నాలుగు కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజలతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉండటానికి ఇది తనకు ఎంతో సహాయపడిందన్నారు.

CM KCR : దేశయాత్రకు బ్రేక్!.. ఫామ్‌హౌస్‌కు కేసీఆర్.. దసరా నుంచి ఢిల్లీలో చక్రం.. PM అవుతారంటూ..


కౌశాంబి పార్లమెంట్ సెగ్మెంట్‌లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు.. మంఝన్‌పూర్, సిరతు, చైల్ ఉన్నాయి. పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం రోజున కౌశాంబి మహోత్సవాన్ని జరుపుకుంటామని సోంకర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం యోగి ఆధిత్యనాథ్ హాజరై కొత్త పథకాలను ప్రకటిస్తుంటారని.. తద్వారా తన పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని సోంకర్ పేర్కొన్నారు.

సిరతు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండో కార్యక్రమంగా వీరాంగన దుర్గా బాబి, చంద్రశేఖర్ ఆజాద్‌ల వేడుకలను నిర్వహిస్తుంటామన్నారు. రాముడి అజ్ఞాతవాసం సందర్భంగా మొదటి రోజు గడిపిన చైల్‌లో మరొక కార్యక్రమం చేపడతామన్నారు. చివరగా నాలుగో కార్యక్రమాన్ని 'సామాజిక్ సమ్రాస్తా భోజ్' పేరుతో కౌశాంబిలోని తన నివాసంలో జరుపుతామని సోంకర్ తెలిపారు. ఇలా పలు కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో మమేకమవుతున్నట్లు సోంకర్ తెలిపారు.

Petrol Diesel : పెట్రోల్ లేదు నాయనా.. ఆ ఇద్దరి మధ్య గొడవతో వాహనదారులకు షాక్.. 31న బంద్


రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఉన్నప్పటికీ ఓట్లను ఏకీకృతం చేయడంలో ప్రధాని మోదీ మంత్రం తనకు సహాయపడిందన్నారు. తాను ఎప్పుడూ ప్రజలతో సన్నిహితంగా ఉంటానని, ఆ విషయాన్ని తన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు అని బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చారు. “నేను ప్రధాని కలవడానికి వెళ్లినప్పుడు మనపై ఆయన చూపే శ్రద్ధ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మనం చెప్పే ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తారు. సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారు. మళ్లీ వాటిని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉండదు.’’ అని సోంకర్ తన అనుభవాన్ని వివరించారు.

Monkeypox : ఇండియాకు మంకీపాక్స్ వైరస్ ముప్పు? -ఈ 5లక్షణాలతో జాగ్రత్తగా ఉండాలన్న ICMR


క్రమశిక్షణ విషయంలో మోదీ నుంచి పాఠం నేర్చుకున్నట్లు సోంకర్ తెలిపారు. సమావేశం ఏదైనా ప్రధాని మోదీ టేబుల్‌పై చెత్త కనిపించదు అన్నారు. దీంతో ప్రధానమంత్రి ఎంత వ్యవస్థీకృతంగా ఉంటారో అన్న విషయం తనకు అప్పుడు బోద పడిన విషయాన్ని సోంకర్ గుర్తు చేసుకున్నారు.

First published:

Tags: CNN-NEWS18, Modi, News18, Pm modi, Prime minister

ఉత్తమ కథలు