హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

శశిథరూర్‌ది బాబర్ డీఎన్ఏ అనుకుంటా..!: రాజాసింగ్

శశిథరూర్‌ది బాబర్ డీఎన్ఏ అనుకుంటా..!: రాజాసింగ్

అయోధ్యలో రామమందిరానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని భారత్ నుంచి వెళ్లగొడతామని రాజాసింగ్ హెచ్చరించారు.

    అయోధ్యలో రామాలయంపై సంచలన కామెంట్స్ చేసిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ మీద బీజేపీ నేత రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శశిథరూర్‌ది హిందూ డీఎన్ఏ కాదని.. ఆయనది బాబర్ డీఎన్ఏ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ‘అయోధ్యలో ఓ ప్రార్థనామందిరాన్ని కూల్చి రామాలయం కట్టాలని ఏ హిందువూ కోరుకోడు’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శశిథరూర్ వ్యాఖ్యానించారు. దీనిపై రాజాసింగ్ మండిపడ్డారు. మోదీ హయాంలోనే అయోధ్యలో రామమందిరం నిర్మితం కావాలని దేశంలోని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటున్నట్టు చెప్పారు.

    శశిథరూర్ వ్యాఖ్యలు.. ఆయన వ్యక్తిగత కామెంట్స్ కావని.. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్నే థరూర్ చెప్పారని.. ఆ వీడియోలో రాజాసింగ్ ఆరోపించారు. దీని వెనుక రాహుల్ గాంధీ ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని భారత్ నుంచి వెళ్లగొడతామని హెచ్చరించారు.

    First published:

    Tags: Ayodhya Ram Mandir, Raja Singh, Shashi tharoor

    ఉత్తమ కథలు