హోమ్ /వార్తలు /జాతీయం /

మనోహర్ పారికర్ లేఖకు రాహుల్ గాంధీ కౌంటర్ లెటర్

మనోహర్ పారికర్ లేఖకు రాహుల్ గాంధీ కౌంటర్ లెటర్

రాహుల్ గాంధీ, మనోహర్ పారికర్

రాహుల్ గాంధీ, మనోహర్ పారికర్

ప్రధాని మోదీకి విధేయత చూపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే మనోహర్ పారికర్ తన మీద విమర్శలతో లేఖ రాశారంటూ రాహుల్ గాంధీ ప్రతి లేఖ రాశారు.

  రాఫెల్ డీల్‌కు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గోవా సీఎం మనోహర్ పారికర్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు లేఖల యుద్ధం చేస్తున్నారు. మంగళవారం గోవా వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను కలిశారు. ఆయన అనారోగ్యంతో ఉండడంతో కలిసి పరామర్శించారు. అయితే, దీనికి సంబంధించి బుధవారం ఓ కామెంట్ చేశారు రాహుల్ గాంధీ. రాఫెల్ డీల్ గురించి మార్చేటప్పుడు కనీసం అప్పటి రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌కు కూడా చెప్పలేదని, ఈ విషయం స్వయంగా మనోహర్ పారికర్ తనకు చెప్పారంటూ రాహుల్ గాంధీ సంచలనాన్ని క్రియేట్ చేశారు.


  రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మనోహర్ పారికర్ ఫైర్ అయ్యారు. ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారని తాను అనుకోలేదని, తమ మధ్య జరిగిన ఐదు నిమిషాల సంభాషణలో అసలు రాఫెల్ డీల్ గురించిన ప్రస్తావనే రాలేదంటూ ఓ రెండు పేజీల లేఖను సంధించారు.


  మనోహర్ పారికర్ లేఖతో బీజేపీకి బూస్ట్ వచ్చింది. దీంతో రాహుల్ గాంధీ చేసిన పనిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారంటూ అమిత్ షా ఫైర్ అయ్యారు. అయితే, మనోహర్ పారికర్ లేఖకు రాహుల్ గాంధీ స్పందించారు. ఆయన ఓ రెండు పేజీల లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
  ‘పారికర్ పరిస్థితి నాకు పూర్తిగా తెలుసు. నేను కలిసిన తర్వాత ఆయనపై ఎంత ఎక్కువ ఒత్తిడి ఉందో అర్థం చేసుకోగలను. ప్రధానికి ఆయన విధేయతను చాటుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుంది. అందుకే ఆ లేఖ రాశారు. ఆయన సహజశైలికి భిన్నంగా లెటర్‌ను లీక్ చేశారు. అయినా, పారికర్ బాగుండాలని కోరుకుంటున్నా.’ అని రాహుల్ గాంధీ ఆ లేఖలో పేర్కొన్నారు. తాను కొత్త విషయాలేవీ చెప్పలేదని, గతంలో మనోహర్ పారికర్ చెప్పిన విషయాన్ని, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న వాటినే ప్రస్తావించానని మరోసారి స్పష్టం చేశారు.

  First published:

  Tags: Manohar parrikar, Rafale Deal, Rahul Gandhi

  ఉత్తమ కథలు