HYDROPONIC FARMING DO YOU EVER SEEN FARMING WITHOUT SOIL PATNA FARMER DOING THIS SINCE 30 YEARS SK
Hydroponic Farming: మట్టి లేకుండా వ్యవసాయం చేస్తున్న హైటెక్ రైతు.. ఇంట్లోనే కూరగాయలు, పూల సాగు
హైడ్రోపోనిక్ వ్యవసాయం
Hydroponic Farming: మహమ్మద్ జావెద్ అనే రైతు 1992 నుంచి హైడ్రోపోనిక్ పద్దతిలో మట్టి లేకుండానే వ్యవసాయం చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? ఈ టెక్నాలజీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మొక్క పెరగాలంటే మట్టి ఉండాలి. విత్తనాలను భూమిలో నాటితే.. మొక్కలు మొలుస్తాయి. వృక్షాలుగా పెరుగుతాయి. కానీ మట్టిలేకుండా (Farming With out Soil) మొక్కలు పెరగడం మీరెప్పుడైనా చూశారా? మట్టిలేని పచ్చదనం గురించి ఎప్పుడైనా విన్నారా? మట్టి లేకుండానే ఎన్నో ఏళ్లుగా మొక్కలు, చెట్లను పెంచుతున్న రైతు గురించి ఇవాళ తెలుసుకుందాం. ఆయన కాంక్రీట్ జంగిల్లోనూ మొక్కలను పెంచుతూ.. పచ్చదాన్ని పెంపొందిస్తున్నారు. బీహార్ (Bihar) రాజధాని పాట్నాకు చెందిన మహమ్మద్ జావెద్.. మట్టి లేకుండా చెట్లను పెంచుతున్నారు. కొత్త టెక్నాలజీ సాయంతో పచ్చదనాన్ని కాపాడడంలో ప్రకృతికి తన వంతు సాయం చేస్తున్నారు. మహమ్మద్ జావెద్ పాట్నాలోని కంకర్‌బాగ్ కాలనీలో నివసిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆయన మట్టి లేకుండానే..విజయవంతంగా మొక్కలను పెంచుతున్నారు. ఇందుకోసం తన ఇంటినే తోటగా మార్చేశారు. అందులో రకరకాల పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు.
మట్టి లేకుండా మొక్కలు ఎలా పెరుగుతాయని ఆశ్చర్యపోతున్నారా? హైడ్రోపోనిక్ పద్దతిలో(Hydroponic farming) ఇది సాధ్యం. మట్టి నుంచి అందే పోషకాలను.. నీటి ద్వారా అందిస్తారు. నీటిలో కరిగిన ఖనిజాలు, పోషకాల నుంచి మొక్కలను పెరుగుతాయి. అప్పుడు మట్టి అవసరమే ఉండదు. ఇలాంటి అధునాతన టెక్నాలజీని ఇజ్రాయెల్ రైతులు ఎక్కువగా వాడుతున్నారు. మనదేశంలో కూడా కొన్ని చోట్ల హైడ్రోపోనిక్ పద్దతిలో మొక్కలను సాగు చేస్తున్నారు.
జావెద్ అహ్మద్‌కు హైడ్రోపోనిక్ వ్యవసాయంపై ఆసక్తి పెరగడంతో.. దాని కోసం ఉద్యోగాన్ని వదిలేశారు. 30 సంవత్సరాల క్రితం పాట్నాలోని శ్రీ కృష్ణ విజ్ఞాన కేంద్రంలో విద్యావేత్తగా ఆయన పనిచేశారు. హైడ్రోపోనిక్స్‌పై ఉన్న ఆసక్తితో ఉద్యోగం మానేసినట్లు తెలిపారు. ఈ పద్దతిలో మొక్కలను పెంచడానికి ఎంతో శ్రమించారు. ఈ క్రమంలోనే ఎంతో కష్టపడి.., జావేద్ బయోఫోర్ట్ ఎమ్‌ని అభివృద్ధి చేశారు. ఒక మిల్లీలీటర్ బయోఫోర్ట్ ఎమ్‌ని ఒక లీటరు నీటిలో కలిపి ద్రావణాన్ని తయారు చేస్తారు. 30 నుండి 40 సెం.మీ ఎత్తు వరకు ఉన్న మొక్కలు.. ఆ ద్రావణం నుంచి... 1 సంవత్సరం పాటు పోషకాలను పొందుతూనే ఉంటాయి. హైడ్రోపోనిక్ టెక్నాలజీకి మరింత ముందుకు తీసుకెళ్లడానికి.. జావేద్ స్వయంగా ప్రత్యేక సేంద్రీయ ఎరువులు కూడా తయారు చేశాడు. ఈ సేంద్రియ ఎరువును గులకరాళ్లు, చిన్న చిన్న రాయి ముక్కలు, ఇసుక మొదలైన వాటితో తయారు చేశారు. ఆ ఎరువుతో కుండీలు, సీసాలు, ఇతర వేస్ట్ మెటీరియల్స్‌లో మొక్కలను పెంచేవారు.
1992 నుంచి హైడ్రోపోనిక్ వ్యవసాయం చేస్తున్నానని మహమ్మద్ జావెద్ చెప్పారు. ఇంటిని అలంకరణ కోస వినియోగించే అన్ని మొక్కలను ఆయన పెంచుతున్నారు. వీటితో పాటు ఆకుకూరలు, కూరగాయల సాగు కూడా ఈ పద్ధతిలోనే సాగు చేస్తారు. హైడ్రోపోనిక్ టెక్నాలజీని ప్రమోట్ చేసేందుకు చాలా సార్లు విదేశాలకు కూడా వెళ్లారు. ఇప్పటి వరకు 250కి పైగా బంతిపూలు, గులాబీ తదితర రకాల మొక్కలను మట్టి లేకుండా పెంచినట్లు జావేద్ తెలిపారు. ఇంట్లో తక్కువ స్థలం ఉంటే హైడ్రోపోనిక్ పద్దతిలో మీరు కూడా మొక్కలను పెంచవచ్చు. ఇంట్లోనే బాటిల్ గార్డెన్, ట్యూబ్ గార్డెన్, రూమ్ గార్డెన్, టేబుల్ గార్డెన్, వాల్ గార్డెన్, విండో గార్డెన్, బాల్కనీ గార్డెన్, హ్యాంగింగ్ గార్డెన్‌ను అభివృద్ధి చేయవచ్చు. ఈ విధంగా మొక్కలు పెంచడం వల్ల వాతావరణంలో స్వచ్ఛత కూడా నెలకొంటుందని జావేద్ తెలిపారు. తక్కువ స్థలంలోనూ ప్రజలు వ్యవసాయం చేసేలా.. హైడ్రోప్రోనిక్ టెక్నాలజీని అన్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలని అహ్మద్ జావెద్ విజ్ఞప్తి చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.