హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Baby houseflies in Nose: మహిళ ముక్కులో 150 ఈగల దండు.. ఆపరేషన్ చేసి తీసేసిన డాక్టర్లు

Baby houseflies in Nose: మహిళ ముక్కులో 150 ఈగల దండు.. ఆపరేషన్ చేసి తీసేసిన డాక్టర్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆస్పత్రిలో చేరే సమయంలో ఆమె సెమీ కోమా స్టేజ్‌లో ఉంది. వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. ఓ పరీక్ష రిపోర్టులో సంచలన విషయం బయటపడింది. ఆమె మెదడుకు సమీపంలో ఈగ లార్వాలు కనిపించాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మన చుట్టూ ఒక్క ఈగ (Housefly) తిరిగితేనే చిరాకు వస్తుంది. శరీరంపై ఎక్కడైనా వాలితే చిర్రెత్తుకొస్తుంది. కానీ ఓ మహిళ  ముక్కులో ఏకంగా 150కి పైగా ఈగల లార్వాలు (Maggots in Nose) మకాం వేశాయి. ముక్కునే ఇంటిగా మార్చేసి బేబీ ఈగలు (baby houseflies)గా మారుతున్నాయి. ఇక ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు కోమాలోకి వెళ్లిన ఆమెను వైద్యుల ఎంతో కష్టపడి కాపాడారు. అరుదైన శస్త్ర చికిత్స చేసి కొత్త జీవితం ప్రసాదించారు. ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌ (Hyderabad)లోనే ఈ సర్జరీ జరిగింది.


  Hyderabad : మత్తివ్వకుండానే బ్రెయిన్ సర్జరీ .. రోగికి ఆ సినిమా చూపించి సక్సెస్ అయిన గాంధీ వైద్యులు


  ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన 50 ఏళ్ల మహిళలకు ఆరు నెలల క్రితం కరోనా సోకింది. ఆ తర్వాత మ్యూకోర్మైకోసిస్. దీనినే బ్లాక్ ఫంగస్‌గా పిలుస్తారు. ఈ ఇన్‌ఫెక్షన్ మెదడు భాగం వరకు వ్యాపించడంతో కుడి కన్నును తొలగించాల్సి వచ్చింది. కరోనా ఇన్‌ఫెక్షన్ వల్ల మూత్రపిండాల పనితీరు కూడా మందగించింది. ఆ తర్వాత డయాబెటిస్ కూడా వచ్చింది. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణిస్తూ వచ్చింది. శరీర భాగాల్లో ఎలాంటి స్పందన లేదు. కుటుంబ సభ్యులు కంగారు పడి ఆస్పత్రికి తీసుకెళ్లారు. చివరకు హైదరాబాద్‌లోని సెంచరీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరే సమయంలో ఆమె సెమీ కోమా స్టేజ్‌లో ఉంది. వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. ఓ పరీక్ష రిపోర్టులో సంచలన విషయం బయటపడింది. ఆమె మెదడుకు సమీపంలో ఈగ లార్వాలు కనిపించాయి. మెదరకు దిగువ భాగంలో దాదాపు 150 వరకు లార్వాలు ఉండడంతో డాక్టర్లు షాక్ తిన్నారు. వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించారు.  సెంచరీ హాస్పిటల్‌లోని స్కల్ సర్జన్, సీనియర్ ENT కన్సల్టెంట్ డాక్టర్ నారాయణన్ జానకిరామ్ ఆధ్వర్యంలో బాధితురాలికి సర్జరీ చేసి.. ఈగల లార్వాలను తొలగించారు. అసలు మెదడుకు అతి సమీపం వరకు ఈగ లార్వాలు ఎలా వచ్చాయన్న వివరాలను సెంచరీ ఆస్పత్రి సీఈవో డాక్టర్ హేమంత్ కౌకుంట్ల వెల్లడించారు.


  ''సాధారణంగా మనపై దోమ లేదా ఈగల వాలినప్పుడు మనకు స్పర్శ తెలుస్తుంది. వెంటనే దానిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తాం. కానీ మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) (Mucormycosis)  కారణంగా రోగి స్పర్శను కోల్పోయింది. ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఈగలు ముక్కు నుంచి లోపలికి వెళ్లాయి. ముక్కు లోపలి భాగంలో గుడ్లు పెట్టడంతో అవి పొదిగి లార్వాలుగా మారాయి. వీటిని మాగోట్స్ అని పిలుస్తారు. ఇవి మెల్లగా మెదడులోకి ప్రవేశించి మెనింజైటిస్‌(Meningitis)కు కారణమవుతాయి. మెనింజైటిస్ వస్తే.. మెదడు, వెన్నెముకపై ఉండే సన్నని పొరలో క్రమంగా వాపు వస్తుంది. తద్వారా తీవ్రమైతే కోమాలోకి వెళ్తారు.'' అని పేర్కొన్నారు.  వైద్యుల కృషితో ఆమెకు కొత్త జీవితం ప్రారంభమయింది. బాధితురాలు పూర్తిగా కోలుకున్నారు. ఎడమ కన్నుతో చూడగలుగుతున్నారు. అంతేకాదు నడవగలుగుతున్నారు. తన పనులను తాను చేసుకోగలుగుతున్నారు. కోమా స్టేజి నుంచి ఆమె తిరిగి ప్రాణాలతో రావడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Guntur, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు