హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Viral Video : ఇంట్లోని బంగారం తీసుకొని ప్రియుడితో భార్య జంప్..టవర్ ఎక్కిన భర్త

Viral Video : ఇంట్లోని బంగారం తీసుకొని ప్రియుడితో భార్య జంప్..టవర్ ఎక్కిన భర్త

రేడియో టవర్ ఎక్కిన భర్త

రేడియో టవర్ ఎక్కిన భర్త

Husband climbed on tower : మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని ఖాండ్వా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఓ భర్త తన భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ వెళ్లగా..పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో ఆగ్రహంతో రేడియో టవర్‌ ఎక్కాడు. 

ఇంకా చదవండి ...

Husband climbed on tower : మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని ఖాండ్వా జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఓ భర్త తన భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ వెళ్లగా..పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంతో ఆగ్రహంతో రేడియో టవర్‌ ఎక్కాడు.  భార్యపై చర్యలు తీసుకోవాలని,లేకుంటే పైనుంచి దూకి చనిపోతానని బెదిరించాడు.తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో చివరిక కిందకు దిగాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూరజ్‌కుండ్‌లో నివసించే అరుణ్ మిశ్రా ఆదివారం మధ్యాహ్నం ఖాండ్వా పోలీస్ స్టేషన్ కి చేరుకుని తన భార్యపై ఎఫ్‌ఐఆర్‌(FIR) నమోదు చేయాలని పోలీసులను కోరాడు. తన భార్య మరో ప్రేమికుడితో కలిసి పారిపోయిందని, ఇంట్లోని బంగారం, వెండితో సహా అన్ని వస్తువులను దోచుకుందని చెప్పాడు. తాను గోవాలో కూలి పని చేసేవాడినని చెప్పాడు. భార్య తన పేరు మీద చాలా అప్పులు చేసి ఇప్పుడు పారిపోయిందని వాపోయాడు సూరజ్.పోలీసులు అతని ఫిర్యాదును నమోదు చేయలేదు. అరుణ్ కాసేపు ప్రాధేయపడి ఒక్కసారిగా బయటకు వచ్చాడు. ఏమీ అర్థంకాక పోలీసు స్టేషన్ దగ్గర రేడియో టవర్ ఎక్కాడు. టవర్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంతలో, ఒక పోలీసు అతనిని గమనించి మిగిలిన సహచరులకు సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటికే చాలా మంది పోలీసులు స్టేషన్ నుండి బయటకు వచ్చి సూరజ్ ని కిందకు దిగమని అడగడం ప్రారంభించారు. ఇంతలో స్టేషన్ ఇన్ చార్జి బద్రీలాల్ అటోడే నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అరుణ్ వినలేదు.

Condoms : ఎగబడి మరీ కండోమ్ లు కొంటున్న యువత..దేనికో తెలిస్తే మైండ్ బ్లాక్ అవడం ఖాయం

తన భార్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని మొండిగా వ్యవహరించాడు. దీంతో పోలీసులు అరుణ్ స్నేహితుడిని సంఘటనా స్థలానికి పిలిపించారు. అరుణ్ స్నేహితుడు వృత్తిరీత్యా న్యాయవాది. అతడు అరుణ్‌తో మొబైల్‌లో మాట్లాడాడు. కాసేపు మాట్లాడిన తర్వాత అరుణ్ కిందకి వచ్చాడు. దీంతో భార్యపై చర్యలు తీసుకోవాలని మళ్లీ పోలీసులను కోరగా, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.


ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. అరుణ్‌పై అతని భార్య వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిందని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం ద్వారా భార్యపై ఒత్తిడి తేవాలనుకుంటున్నాడని చెప్పారు. కాగా, టవర్ ఎక్కిన యువకుడిని చూసి జనాలు గుమిగూడారు. చాలా మంది ఆశ్చర్యపోయారు. చాలా మంది నవ్వుకున్నారు. కాగా,దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Extra marital affair, Husband, Madhya pradesh, Viral Video

ఉత్తమ కథలు