Home /News /national /

HUSBAND SEXUAL ATTACK ON HIS WIFE CONSIDER AS RAPE KARNTAKA HIGH COURT SAYS VRY

Karnataka : భార్యను బలవంతం చేసినా అత్యాచారమే.. కోర్టు సంచలన తీర్పు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Karnataka : భార్యభర్తల లైంగిక సంబంధం గురించి కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యపై బలవంతపు లైంగిక చర్యకుపాల్పడిన అది అత్యాచారం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

    సంధర్భాన్ని బట్టి కోర్టులు సహజన్యాయ సూత్రాలకు అనుగుణంగా తీర్పులు వెలువరిస్తారు. అయితే ఇటివల భార్యభర్తల మధ్య లైంగిక సంబంధాలు సైతం కోర్టులెక్కుతుండడంతో కోర్టులు పలు కేసుల్లో సంచలనాత్మక తీర్పులు ఇస్తున్నాయి. ఈ క్రమంలో భార్య,భర్తల మధ్య బలవంతపు సెక్స్‌ను కూడా నేరంగా పరిగణిస్తున్నారు. పెళ్లి అనేది భర్తకు లైసెన్స్ కాదని, ఆమె ప్రేమానురాగాల చేతనే లైంగిక సంబంధాలను కొనసాగించాలనే సూచనలు చేస్తూ పలు తీర్పులు వెలువడుతున్నాయి.

    ఈ క్రమంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2017లో పెళ్లి అయిన తర్వాత తనను ఓ సెక్స్ బానిసలా తన భర్త చూస్తున్నాడని, ఆసహజమైన సెక్స్‌కు పాల్పపడుతున్నాడంటూ ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ భర్తపై పోక్సో చట్టం కింద నమోదు చేయడంతో పాటు రేప్ కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలోనే కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే భర్త తనపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోర్టుకు విన్నవించాడు. పెళ్లి చట్టం ప్రకారం భార్యకు ఇష్టం లేకున్నా సెక్స్‌ చేయవచ్చని కోర్టుకు తెలిపాడు.

    Hyderabad : మరోసారి టాలీవుడ్ డ్రగ్ కేసు.. సీఎస్‌కు కోర్టు ధిక్కారణ నోటిసులు

    అయితే భర్త తరపు న్యాయవాది వాదనలను కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. పెళ్లి చేసుకున్నంత మాత్రం భార్యపై భర్తకు ప్రత్యేక అధికారాలు ఏమి ఉండవని స్పష్టం చేసింది. పెళ్లి అనేది భర్త చేసే చర్యలకు లైసెన్స్ కాదని పేర్కోంది. దీంతో మిగతా అత్యాచారం కేసుల వలే భర్తపై కూడా అత్యాచారం కేసు లాంటిదేనని తీర్పు వెళ్లడించింది. ఇది ముమ్మాటికి రేప్ కేసు అంటూ స్పష్టం చేసింది. సంధర్భాన్ని బట్టి చట్టంలోని సెక్షన్లకు కొన్ని మినహాయింపులు ఉంటాయని పేర్కోంది.

    సో మొత్తం మీద కర్ణాటక కోర్టు తీర్పును బట్టి ఏ భర్త అయినా భార్యపై బలవంతపు సెక్స్ కు పాల్పడితే అది అత్యాచారం కింద కేసు నమోదు చేసే అవకాశాలు ఉంటాయని ఈ తీర్పు ద్వారా స్పష్టం చేసింది. సో దీంతో భర్తలు జర జాగ్రత్తగా ఉండక తప్పదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Highcourt, Karnataka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు