హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Extramarital Affair : ప్రసవం కోసం పుట్టింటికి భార్య..ప్రియురాలితో భర్త జంప్!

Extramarital Affair : ప్రసవం కోసం పుట్టింటికి భార్య..ప్రియురాలితో భర్త జంప్!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Husband ran away with lover : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ భర్త చేసిన పని తెలిసి భార్య ఆశ్చర్యపోయింది. ఛోటా బంగార్డా ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం బబిత అనే మహిళతో వివాహమైంది. 15 రోజుల క్రితం తండ్రి కూడా అయ్యాడు. అయితే భార్యను ప్రసవం కోసం ఆమె పుట్టింటికి పంపించిన భర్త తర్వాత ఖజ్రానా ప్రాంతానికి చెందిన మరో అమ్మాయితో కలిసి పారిపోయాడు.

ఇంకా చదవండి ...

Husband ran away with lover : మధ్యప్రదేశ్‌(Madhyapradesh)లోని ఇండోర్‌లో ఓ భర్త చేసిన పని తెలిసి భార్య ఆశ్చర్యపోయింది. ఛోటా బంగార్డా ప్రాంతంలో నివసిస్తున్న రాజేష్ అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం బబిత అనే మహిళతో వివాహమైంది. 15 రోజుల క్రితం తండ్రి కూడా అయ్యాడు. అయితే భార్యను ప్రసవం కోసం ఆమె పుట్టింటికి పంపించిన భర్త తర్వాత ఖజ్రానా ప్రాంతానికి చెందిన మరో అమ్మాయితో కలిసి పారిపోయాడు. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని భార్యకు ఫేస్‌బుక్ ద్వారా తెలిసింది. దీంతో భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది బబిత. భర్త చాలా కాలంగా ముస్లిం అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య బబిత ఆరోపిస్తోంది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. భర్త మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని భార్య చెప్పింది. అంతే కాదు భర్త ఫోన్‌లో కూడా తనను బెదిరించాడని తెలిపింది.

బబిత 15 రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టిన తర్వాత నిందితుడైన భర్త ఆమెను కలవలేదు. అంతే కాదు అత్తమామలు కూడా తనను కలవడానికి రాలేదని బబిత తెలిపింది. భర్త వ్యవహారంపై అత్తమామలని ప్రశ్నించగా.. అత్తగారు తనను బెదిరించారని, మౌనంగా ఉండకపోతే నీ అంతుచూస్తాం అని తనను బెదిరించారని బబిత తెలిపింది. తన భర్త కూడా వేరే ఫోన్ నెంబర్ నుంచి తనకు ఫోన్ చేసి బెదిరించాడని భార్య ఆరోపిస్తోంది. నిందితుడైన భర్త ఎక్కడున్నాడో, ఎవరితో ఉన్నాడో అత్తగారికి తెలుసని మహిళ పేర్కొంది. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

OMG : ఫేస్ బుక్ లో మెసేజ్ లకు కు రిప్లై ఇవ్వట్లేదని..ఇంటికెళ్లి యువతిని కత్తితో పోడిచి చంపేశాడు!

మరోవైపు, : రాజస్తాన్(Rajastan) రాష్ట్రంలోని బార్మర్ లో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్త(Husband)ను దారుణంగా హత్య చేసింది. తక్కువ జీతం సంపాదిస్తున్నాడని భర్తను బెల్టుతో గొంతుబిగించి హత్య చేసింది. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. . ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Extra marital affair, Madhya pradesh, Wife and husband

ఉత్తమ కథలు