Viral News: నా భార్య స్నానం చేయదు.. అందుకే విడాకులు.. ఇలాంటి విచిత్ర భర్తను ఎక్కడా చూసి ఉండరు

ప్రతీకాత్మక చిత్రం

Variety divorce case: విడాకుల పిటిషన్ లో.. 'స్నానం చేయాలి అని అడిగిన ప్రతిరోజు తన భార్య తనతో వాగ్వాదానికి దిగుతుంది' అని భర్త పేర్కొన్నట్లు కౌన్సెలర్‌ వెల్లడించారు. భార్య మాత్రం తన భర్తతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు వివరించారు.

  • Share this:
సాధారణంగా భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారంటే దాని వెనుక ఏదో ఒక బలమైన కారణమే ఉంటుంది. చిన్న కారణాలకు ఎవరూ విడాకులు కావాలంటూ పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగరు. భార్యభర్తలన్న తర్వాత సర్దుకుపోవాలి అనే భావనతో కలిసే ఉండి పోతారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక భర్త మాత్రం చాలా చిన్న కారణానికే భార్య నుంచి విడాకులు కోరాడు. భార్య రోజూ స్నానం చేయడం లేదనే కారణంతో ఆమెకు ట్రిపుల్‌ తలాక్‌ కూడా చెప్పేశాడు. విడాకులు కావాలంటూ అతడు చెప్పిన వింత కారణం ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. అయితే తమ వివాహబంధాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంతో అతని భార్య ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, అలీగఢ్‌ జిల్లా, చందౌస్ గ్రామానికి ఓ యువకుడు.. క్వార్సీ గ్రామానికి చెందిన యువతిని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక ఏడాది వయసున్న బిడ్డ కూడా ఉంది. అయితే ఈ చిన్న కుటుంబంలో ఒక వింత సమస్య వచ్చి పడింది. ఇన్నిరోజులు భార్యతో బాగానే కాపురం చేసి బిడ్డకు తండ్రి అయిన సదరు భర్త అకస్మాత్తుగా విడాకులు కావాలని భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అదేమిటని ప్రశ్నిస్తే నువ్వు రోజు స్నానం చేయడం లేదని.. అందుకే విడాకులు కోరుతున్నానని అతడు చెప్పాడు. ట్రిపుల్‌ తలాక్‌ కూడా ఇవ్వడంతో భార్య తీవ్ర ఆందోళనకు గురైంది.

Sukhibhava: ‘అయ్యయ్యో వద్దమ్మా’.. ‘సుఖీభవ’.. ఈ యాడ్‌ గురించి హైదరాబాద్  పోలీసులకు తెలియడంతో..

దీంతో ప్రతిరోజు స్నానం చేయడం లేదనే కారణంతో తన భర్త తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చారని బాధితురాలు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కి రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చింది. దీంతో అవాక్కయిన ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు.. ఆ తరువాత తేరుకొని దంపతులకు కౌన్సెలింగ్ మొదలు పెట్టారు. ఈ దంపతులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తూ వివాహాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

Viral Video: ఇదెక్కడి చిత్రం.. ఈ బాలిక ఎడమ కంటి నుంచి.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.

అయితే కౌన్సెలింగ్ సమయంలో భర్త తన భార్య నుంచి విడాకులు కావాలని పదేపదే చెప్పినట్లు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కి చెందిన ఓ కౌన్సెలర్‌ చెప్పారు. విడాకులు ఇప్పించడానికి సహాయం చేయాలని కోరుతూ ఒక అప్లికేషన్ కూడా తమకు ఇచ్చారని తెలిపారు. "కారణం, ఏంటయ్యా?" అని ప్రశ్నించిన ప్రతిసారీ కూడా తన భార్య స్నానం చేయడం లేదని.. అందుకే విడాకులు కావాలని ఆ భర్త బదులిచ్చాడట. తన విడాకుల పిటిషన్ లో.. 'స్నానం చేయాలి అని అడిగిన ప్రతిరోజు తన భార్య తనతో వాగ్వాదానికి దిగుతుంది' అని భర్త పేర్కొన్నట్లు కౌన్సెలర్‌ వెల్లడించారు. భార్య మాత్రం తన భర్తతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు వివరించారు.

Viral video: బాలుడి తలపై గిన్నె పెట్టి హెయిర్ కటింగ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

చిన్న కారణాలకే పెళ్లి బంధాన్ని తెంచుకోవద్దని భర్తకు ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇస్తున్నామని కౌన్సెలర్‌ తెలిపారు. భార్యతో వచ్చిన సమస్య చాలా చిన్నదని.. వెంటనే పరిష్కరించవచ్చని వివరిస్తూ అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు కౌన్సెలర్‌. అలాగే విడిపోవడం వల్ల బిడ్డను పెంచడం కూడా చాలా కష్టం అయిపోతుందనే విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే విడాకుల దరఖాస్తుకు భర్త చెప్పిన కారణం ఏ హింసాత్మక చట్టం, మహిళలపై నేరం కిందకు రాదు కాబట్టి పిటిషన్ ముందుకు సాగదని ఉమెన్ ప్రొటెక్షన్ అధికారులు వెల్లడించారు. కౌన్సిలింగ్ సహాయంలోనే ఈ చిన్న సమస్యను పరిష్కరించడానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
Published by:Shiva Kumar Addula
First published: