హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఆ కారణంతో భార్యను ఇంట్లోకి అనుమతించని భర్త.. చెరువులోకి దూకేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..

ఆ కారణంతో భార్యను ఇంట్లోకి అనుమతించని భర్త.. చెరువులోకి దూకేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..

రీటా దేవి

రీటా దేవి

ఓ వ్యక్తి తన భార్యను ఇంట్లో అడుగుపెట్టేందుకు అనుమతించలేదు. అతని తల్లి కూడా అందుకు సపోర్ట్‌గా నిలిచింది. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

ఓ వ్యక్తి తన భార్యను ఇంట్లో అడుగుపెట్టేందుకు అనుమతించలేదు. ఆడ శిశువుకు జన్మనిచ్చిందనే ఒకే ఒక్క కారణంతో ఆమె ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాడు. ఈ ఘటన బిహార్ (Bihar) రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. బగాహా (Bagaha) శాస్త్రి నగర్‌లోని పోఖ్రా తోలాకు చెందిన ప్రదీప్ సాహ్ని, రీటా దేవి దంపతులు. ఈ దంపతులకు మంగళవారం ఆడశిశువు జన్మించింది (Girl Child Birth). బగాహా సబ్ డివిజనల్ ఆస్పత్రిలో రీటా దేవి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ తర్వాత ఆమె తన బంధువుల కోసం చూసింది. ఆస్పత్రిలో తన భర్త కోసం 12 గంటలకుపైగా ఎదురుచూసింది. కానీ అతడు మాత్రం అక్కడికి రాలేదు.

మరోవైపు రీటా దేవికి కూతురు పుట్టిందనే విషయాన్ని.. ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆశా వర్కర్ (ASHA Worker) పుష్ప దేవి కుటుంబానికి తెలియజేసింది. ఇది తెలిసిన ప్రదీప్ గ్రామంలోని చెరువులోకి (Jump into Pond) దూకాడు. అక్కడున్న స్థానికులు అతడిని కాపాడారు. అయితే రీటా దేవి భర్త ప్రదీప్, అత్త మాత్రం ఆమెను, పాపను ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించారు.

Hyderabad: పనిచేసే చోట పరిచయమైన వ్యక్తితో వివాహేతర సంబంధం.. వామ్మో ఆమె మాములు మహిళ కాదు.. చివరకు ఇలా..


ఇక, రీటా దేవిది జమునాపూర్‌లోని బిరౌలి గ్రామం. ఆమెకు ప్రదీప్‌ సాహ్నితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయితే మరోసారి తాను ఆడశిశువు జన్మనిస్తే ఇంటికి రానివ్వమని భర్త, అత్తలు బెదిరింపులకు పాల్పడ్డారని రీటా దేవి తెలిపింది. ఇంటికి వస్తే చంపేస్తామని కూడా హెచ్చరించారని బోరున విలపించింది. ఈ క్రమంలోనే రీటా దేవి ఆడశిశువు జన్మనివ్వడంతో వారు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీటా దేవి, ఆమెకు పుట్టిన బిడ్డను ఇంటికి తీసుకెళ్లేది లేదని తేల్చిచెప్పారు.

భార్యపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు.. లక్షలు ఖర్చు చేసి ఆమెను ఆస్ట్రేలియాకు పంపించాడు.. కానీ చివరకు..

దీంతో అక్కడ పెద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రీటా దేవి భర్త, అత్తతో ఆస్పత్రి సిబ్బంది మాట్లాడారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు రీటా దేవిని ఇంటికి తీసుకెళ్లేందుకు వారు అంగీకరించారు. అయితే రీటా దేవి మాత్రం భయపడుతూనే భర్త ఇంటికి వెళ్లింది. ఇక, బేటీ పడావో, బేటీ బచావో (Beti Padhao, Beti Bachao) .. వంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ.. కొందరు మగవాళ్ల ఆలోచనలు మారకపోవడం ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి.

First published:

Tags: Bihar, Save Girl Child