తలాక్ చెప్పిన భర్త.. మతం మారి వేరొకరిని పెళ్లిచేసుకున్న భార్య..

రేష్మా మతం మార్చుకుని అతడిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రేష్మా.. తన పేరును రాణిగా మార్చుకుంది. రేష్మా, దీపక్ రాధోడ్ మధ్య వివాహం జరిగిన తర్వాత వారిద్దరికీ బెదిరింపులు ఎక్కువయ్యాయి.

news18-telugu
Updated: May 17, 2019, 2:56 PM IST
తలాక్ చెప్పిన భర్త.. మతం మారి వేరొకరిని పెళ్లిచేసుకున్న భార్య..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 17, 2019, 2:56 PM IST
ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త తలాక్ చెప్పడంతో ఆమె మతం మారి మరొకరిని పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో ఈ విచిత్ర ఘటన జరిగింది. యూపీలోని ఫిలిబిత్‌లో మహమ్మద్ ఇస్లాం కుమార్తె రేష్మాకు, మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లు కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత భార్యభర్తల మధ్య విబేధాలు వచ్చాయి. రేష్మ మీద దాడి చేసిన రియాజ్.. ఆమెకు తలాక్ చెప్పేశాడు. ఈ ఏడాది ఏప్రిల్ 5న వారిద్దరూ విడిపోయారు. కట్ చేస్తే.. భార్యా భర్తల మధ్య విబేధాలు వచ్చిన సమయంలో రేష్మాకు దీపక్ రాధోడ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. వారిద్దరూ గిఫ్ట్‌లు కూడా ఇచ్చి పుచ్చుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రేష్మా మతం మార్చుకుని అతడిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రేష్మా.. తన పేరును రాణిగా మార్చుకుంది. రేష్మా, దీపక్ రాధోడ్ మధ్య వివాహం జరిగిన తర్వాత వారిద్దరికీ బెదిరింపులు ఎక్కువయ్యాయి.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...