Home /News /national /

HUSBAND DIVORCES WIFE AFTER SHE COOKS MAGGI FOR BREAKFAST LUNCH AND DINNER PVN

Marriage In Soup : రోజూ మ్యాగీ పెడుతుందని..భార్యకు విడాకులిచ్చిన భర్త

కాపురం కూల్చిన మ్యాగీ

కాపురం కూల్చిన మ్యాగీ

Husband divorces wife after she cooks Maggi :సాధారణంగా భార్యాభర్తలు విడాకులు(Divorce)తీసుకుంటున్నారంటే దాని వెనుక ఏదో ఒక బలమైన కారణమే ఉంటుంది. చిన్న కారణాలకు ఎవరూ విడాకులు కావాలంటూ పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగరు. భార్యభర్తలన్న తర్వాత సర్దుకుపోవాలి అనే భావనతో కలిసే ఉండి పోతారు.

ఇంకా చదవండి ...
Husband divorces wife after she cooks Maggi :సాధారణంగా భార్యాభర్తలు విడాకులు(Divorce)తీసుకుంటున్నారంటే దాని వెనుక ఏదో ఒక బలమైన కారణమే ఉంటుంది. చిన్న కారణాలకు ఎవరూ విడాకులు కావాలంటూ పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగరు. భార్యభర్తలన్న తర్వాత సర్దుకుపోవాలి అనే భావనతో కలిసే ఉండి పోతారు. అయితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక భర్త మాత్రం చాలా చిన్న కారణానికే భార్య నుంచి విడాకులు కోరాడు. తన భార్యకు వంట చేయడం రాక..టిఫిన్‌, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా మ్యాగీనే వండుతుందని ఆమె నుంచి విడాకులు కోరాడు. మూడు పూటలు మ్యాగీ తినలేక విసిగిపోయిన ఆ భర్త తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం పెళ్లిళ్లతోపాటు విడాకులు కూడా ఇన్‌స్టెంట్‌గా మారుతున్న తీరుకు ఇది ఉదాహరణగా నిలుస్తున్నది.

కర్ణాటకలోని మైసూరులోని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఎల్‌ రఘునాథ్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను బళ్లారి జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన విడాకుల కేసును ఆయన గుర్తు చేశారు. భార్య వంటపై విసుగెత్తిన ఒక వ్యక్తి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ నూడుల్స్‌, మధ్యాహ్న భోజనం, రాత్రి పూట కూడా నూడుల్సే. ఆ భార్య షాప్‌కు వెళ్లి కేవలం ఇన్‌స్టంట్‌ నూడుల్స్ మాత్రమే కొంటుంది. రోజూ మూడు పూటలా అదే వండి పెడుతుంది. ఇది తప్ప ఆమెకు మరేది రాదు. ఈ విషయం తెలిసి రోజూ మూడు పూటలు నూడుల్స్‌ తినలేక విసుగెత్తిన భర్త విడాకులు కోరాడు అని చెప్పారు.

కాగా, ఆ భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని న్యాయమూర్తి ఎంఎల్‌ రఘునాథ్‌ తెలిపారు. ఈ విడాకులను ‘మ్యాగీ కేసు’గా ఆయన అభివర్ణించారు. చాలా చిన్న కారణాలతో భార్యాభర్తలు విడాకులు కోరుతున్నారని, ఇలాంటివి ఎన్నో తాను చూశానని అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Divorce couple, Karnataka

తదుపరి వార్తలు