హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

భార్య జంతు ప్రేమ.. బిచ్చగాడిగా మారిన భర్త.. ఇద్దరు పనివాళ్లతో కలిసి భిక్షాటన

భార్య జంతు ప్రేమ.. బిచ్చగాడిగా మారిన భర్త.. ఇద్దరు పనివాళ్లతో కలిసి భిక్షాటన

సుశీల్ సమీర్

సుశీల్ సమీర్

ఇటీవల పశువులకు మేత కొరత ఏర్పడడంతో... వారు దాణా, గడ్డి కోసం భిక్షాటన చేస్తున్నారు. భిక్షాటన చేసిన డబ్బుతో పశువులకు మేత, మందులు ఇస్తున్నారు. ఈ పని ఒక్కరే చేయడం సాధ్యం కాదని గ్రహించి.. ఇద్దరు కూలీలను కూడా పెట్టుకున్నారు

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

హిందూ మతంలో గోవుకు పూజనీయ స్థానం ఉంది. ఆవును దేవతగా కొలుస్తారు. అందుకే గోమాతగా పిలుస్తారు. గోవులక సేవ చేస్తే..మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. సొంత ఖర్చులతో గోశాలలను నడుపుతున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన సుశీల్ సమీర్ యాదవ్ కూడా ఆవుల కోసం గోశాల నిర్వహిస్తున్నారు. భిక్షాటన చేస్తూ.. ఆ డబ్బుతోనే ఆవులను బాగోగులను చూసుకుంటున్నాడు. నిస్సహాయ ఆవులు, అనారోగ్యం బారిన పడిన గోవులను అక్కున చేర్చుకొని... వాటిని సాదుతున్నాడు. రైతుల వద్ద ఉన్న పశువులకు అనారోగ్య సమస్యలు వచ్చినా.. ఉచితంగా చికిత్స అందిస్తున్నాడు. ఇలా పగలూ రాత్రి.. ఆవుల సేవలోనే తరిస్తున్నారు. ఐతే ఇప్పుడు వాటి కోసం బిచ్చగాడిలా మారిపోయారు సుశీల్ సమీర్ యాదవ్.

 OMG: కొంప ముంచిన గూగుల్ తల్లి.. టెన్షన్ లో రైల్వే ప్రయాణికులు.. అసలేం జరిగిందంటే..?

బెగుసరాయ్ జిల్లా మతిహాని మండలం కేత్మా ప్రాంతానికి చెందిన సుశీల్ సమీర్ యాదవ్, కాజల్ భార్యాభర్తలు. కాజల్‌కు పశువులంటే ప్రాణం. సొంత పిల్లల్లా చూసుకుంటారు. ఆ తర్వాత సుశీల్‌కి కూడా ఇది అలవాటయింది. జంతువుల పట్ల వారికున్న ప్రేమ.. గోసేవ చేసేందుకు ప్రేరేపించింది. వీలైనన్ని ఎక్కువ ఆవులను సంరక్షించాలన్న మంచి ఉద్దేశంతో...సుశీల్ సమీర్ దంపతులు గో సురక్షా ధామ్‌ను ప్రారంభించారు. ఐతే ఇటీవల పశువులకు మేత కొరత ఏర్పడడంతో... వారు దాణా, గడ్డి కోసం భిక్షాటన చేస్తున్నారు. భిక్షాటన చేసిన డబ్బుతో పశువులకు మేత, మందులు ఇస్తున్నారు. ఈ పని ఒక్కరే చేయడం సాధ్యం కాదని గ్రహించి.. ఇద్దరు కూలీలను కూడా పెట్టుకున్నారు. జీతాలిచ్చి మరీ భిక్షాటన చేయిస్తున్నారు. భిక్షాటన చేసిన డబ్బుతోనే వారికి కూడా జీతాలు ఇస్తున్నారు.

Ujjwala Scheme: గ్యాస్‌ సిలిండర్‌పై సర్కారు రాయితీ..ఆ స్కీమ్‌లో ఉన్నవారికి పండగే.

సుశీల్ సమీర్ యాదవ్ అక్టోబర్ 2022 నుంచి గో సేవను ప్రారంభించాడు. స్థానిక ప్రజలు సుశీల్ సమీర్ యాదవ్‌కు 45 దూడలను విరాళంగా ఇచ్చారు. వాటిలో కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాయి. అలాంటి వాటికి సుశీల్ సమీర్ యాదవ్ చికిత్స అందించాడు. కొన్ని ఆవులు అనారోగ్యంతో ఉన్నా పాలు ఇస్తున్నాయి. ఇంతకుముందు తాను డెయిరీ ఫామ్‌లో పని చేసేవాడినని.. పశువులను చూసుకోవడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పారు. సుశీల్ సమీర్ యాదవ్.. బెగుసరాయ్‌ పట్టణంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ... ఆవుల కోసం దాతల నుంచి డబ్బు, ధాన్యం, గడ్డి మొదలైన వాటిని సేకరిస్తున్నాడు.

సుశీల్ సమీర్ యాదవ్ గోశాలకు ఎవరైనా పశువులను దానం చేయవచ్చు. బెగుసరాయ్‌లోని మతిహానీ రోడ్ కేత్మా సమీపంలో ఉన్న గో సురక్షా ధామ్‌లో గోవులను ఇవ్వవచ్చని ఆయన తెలిపారు. మరిన్ని వివరాల కోసం తమ ఫోన్ నెంబర్ 6294558990కి కాల్ చేయవచ్చని సూచించారు. ఎవరైనా తమ గోశాలకు సాయం చేయాలనుకుంటే.. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా సాయం చేయవచ్నచని కోరుతున్నారు. ఆవుల కోసం భిక్షాటన చేస్తున్న సుశీల్‌ను చూసి కొందరు జాలి పడుతుంటే.. మరికొందరు చాలా గొప్ప పని చేస్తున్నావని ప్రశంసిస్తున్నారు.

First published:

Tags: Bihar, Cows